|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?

Published: 08-12-2025, 2:08 AM
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
  • సమంత, రాజ్ నిడిమోరు కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో వివాహం చేసుకున్నారు.
  • పెళ్లి తర్వాత వెంటనే షూటింగ్‌లో పాల్గొని సమంత తన డెడికేషన్‌ను చాటుకుంది.
  • ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత యూరప్‌లో హనీమూన్ ప్లాన్ చేసినట్టు వార్తలు.
  • సమంత నటిస్తూ, నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ జరుగుతోంది.

నటి సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత హనీమూన్‌కి బదులుగా వెంటనే తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అభిమానులను ఆశ్చర్యపరిచిన ఈ జంట, ఇప్పుడు యూరప్‌లో రొమాంటిక్ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

సమంత-రాజ్ పెళ్లి: వెంటనే పనిలోకి సామ్

నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం సింగిల్ గా ఉన్న సమంత.. ఆతరువాత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. కొద్ది కాలంగా కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట.. తాము ఒక్కటవ్వబోతున్నట్టు హింట్స్ కూడా ఇచ్చారు. వీరిద్దరి పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అందరు అనుకున్నట్టగానే సమంత రాజ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో.. భూత శుద్ది పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడిస్తూ.. సమంత కొన్నిఫోటోలు కూడా తన సోషల్ మీడియా పేజ్ లో ఫోస్ట్ చేసింది.

పెళ్లి తర్వాత పెద్దగా బ్రేక్ తీసుకోలేదు సమంత. మూడు రోజుల తరువాత తన పనిలో తాను నిమగ్నమయ్యింది. రీసెంట్ గా సమంత తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. తాను నటిస్తు, నిర్మిస్తోన్న ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయగా.. అందులో సామ్ పాల్గొన్నారు. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా మహూర్తపు పూజలో కూడా ఆమె పాల్గొన్నారు. పెళ్లి తరువాత వెంటనే హనీమూన్ అని బ్రేక్ తీసుకోకుండా.. షూటింగ్ లో పాల్గొనడంతో.. ఆమెను అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. చేసే పనిలో ఆమె డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు.

యూరప్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, రాజ్

సమంత రాజ్ పెళ్లి చేసుకున్న తరువాత వారి హనీమూన్ పై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ జంట తమ రొమాంటిక్ వెకేషన్ ను ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు? ఎప్పుడు వెళ్లబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా గమనించారు. అయితే సమంత షూటింగ్ లో పాల్గొనడంతో.. ఈజంట హనీమూన్ కు వెళ్లరేమో అని అంతా అనుకున్నారు. అయితే వీరు కాస్త లేట్ గా ట్రిప్ ను ప్లాన్ చేసినట్టు మరోక న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కాస్త తీరిగ్గా అయినా.. లాంగ్ ట్రిప్ ను వేయాలని వారు అనుకుంటున్నట్టు సమాచారం. యూరప్ లోని రొమాంటిక్ లొకేషన్స్ ను చుట్టేసి రావాలని ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్ అనుకుంటున్నారట. ప్రస్తుతం ఇక్కడ ఉన్న షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకున్న తరువాత హనీమూన్ కు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సోషల్ మీడియా సమాచారం తప్పించి.. ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.

నిర్మాతగా సమంత కొత్త అవతారం

నటిగా సమంత సినిమాలు తగ్గించింది. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన సామ్.. శుభం సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తూ.. నిర్మిస్తోంది. అంతే కాదు పలు వ్యాపారాలు కూడా ఆమె నిర్వహిస్తోంది. క్లాతింగ్ బ్రాండ్స్ తో పాటు జ్యూవెల్లరీ, పెర్ఫ్యూమ్ బ్రాండ్స్ కూడా ఆమె నిర్వహిస్తోంది. ఈ వ్యాపారంలో సమంత కోట్లు సంపాదిస్తున్నట్టు సమాచారం. నాగచైతన్యతో పెళ్లి.. విడాకుల తరువాత మయోసైటిస్ వ్యాధి భారిన పడింది హీరోయిన్. దాదాపు ఏడాదిన్నర ట్రీట్మెంట్ తరువాత ఆమె కోలుకున్నారు. అన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడిప్పుడే.. మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు.

సమంత, రాజ్ హనీమూన్ వివరాలపై అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, తమ రొమాంటిక్ యూరప్ ట్రిప్‌ను ఆస్వాదించాలని ఈ జంట ఎదురుచూస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.