
📌 Key Points
- సింగర్ సునీత తాజా ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీపై షాకింగ్ వ్యాఖ్యలు.
- మహిళలకు ఇండస్ట్రీ సురక్షితం కాదని, దోపిడీ ఉందని సునీత ఆరోపణ.
- 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న సునీత.
- ఫెమినిజం అంటే సిగరెట్ లైటర్ ఫ్రీడమా అంటూ సునీత ఘాటు ప్రశ్నలు.
ప్రముఖ సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాలను, మహిళలకు ఎదురయ్యే సవాళ్లను ఆమె నిర్భయంగా బయటపెట్టారు. ఫెమినిజంపై ఆమె చేసిన ఘాటు ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి.
ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేదా?
Singer Sunitha : ఎన్నో ఏళ్లుగా సింగర్ గా సినీ పరిశ్రమలో ఉంటూ స్టార్ సింగర్ గా ఫేమ్ తెచ్చుకుంది సునీత. ఇప్పుడు కూడా సినిమాల్లో పాడుతూ ఈవెంట్స్, కాన్సర్ట్స్ నిర్వహిస్తూ బిజీగానే ఉంది సునీత. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత కొన్ని విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రిలీజ్ చేసారు.
సునీత ఎదుర్కొన్న చేదు అనుభవాలు!
ఈ ప్రోమోలో సునీత మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ కాదు. నేను ఇండస్ట్రీలో సక్సెస్ అయినా ఇదే మాట చెప్తాను. ఇక్కడ దోపిడీ ఉంది. చేతులు వెయ్యడం ఈ రోజుల్లో పెద్ద విషయమే కాదు. నేను అలాంటివి 18 ఏళ్ళు ఉన్నప్పుడే ఫేస్ చేశాను. ఇలాంటివాటికి అసలు ఎండ్ ఉండదు. ఇక్కడ ఒకరితో పెద్ద మనిషిలా బిహేవ్ చేసేవాళ్లు ఇంకొకరితో ఇంకోలా బిహేవ్ చేస్తారు. అమ్మాయిలు బట్టల విషయంలో నా బాడీ నా ఇష్టం అంటే అతని కళ్ళు అతని ఇష్టం. ఫెమినిజం అంటే ఏంటి? మగవాళ్ళు, ఆడవాళ్లు ఈక్వల్ కానే కారు. సిగరెట్ లైట్ ని టార్చ్ ఫర్ ఫ్రీడమ్ అనుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేసింది.
ఫెమినిజంపై సునీత సంచలన ప్రశ్న!
దీంతో ప్రోమోలోనే ఈ రేంజ్ వ్యాఖ్యలు ఉన్నాయంటే ఇక ఫుల్ ఇంటర్వ్యూలో ఇంకెన్ని సంచలన వ్యాఖ్యలు చేసిందో సునీత అని ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు.
సునీత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూనే, ఇండస్ట్రీలోని వాస్తవాలపై మరింత లోతైన చర్చకు ఇది నాంది పలికింది. మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!


