
📌 Key Points
- రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ కథాంశంపై అదిరిపోయే హింట్ ఇచ్చేశాడు!
- సుకుమార్ తన ‘RC17’ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా మెగా ఫ్యాన్స్ ను ఉత్కంఠలో ఉంచారు!
- ఇద్దరు డైరెక్టర్ల విభిన్న స్టైల్స్.. కానీ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్లకు కేరాఫ్ అడ్రెస్ వాళ్లే!
- ‘వారణాసి’ ట్రెజర్ హంట్ కథతో, ‘RC17’ సస్పెన్స్‌తో ఫ్యాన్స్ కు పండగ ఖాయం!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, సుకుమార్ తమ సినిమాలపై ఎలాంటి స్టైల్ పాటిస్తారో తెలుసా? ఒకరు ఓపెన్ గా చెప్తే, మరొకరు సీక్రెట్ గా ఉంచుతారు. ఈ ఇద్దరి మాస్ స్టైల్స్ వెనుక అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం!
రాజమౌళి “వారణాసి” మాస్ ప్లాన్ లీక్!
Rajamouli Sukumar : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంటే రాజమౌళి, సుకుమార్ లే. ఇద్దరూ ఇద్దరే. ఎలివేషన్స్ తో, ఎమోషన్ తో హీరోని బాగా వాడుకొని పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా తీయడంలో ఇద్దరూ సిద్దహస్తులే. బాహుబలితో రాజమౌళి పాన్ ఇండియాకి వెళ్తే కాస్త ఆలస్యం అయినా పుష్పతో సుకుమార్ పాన్ ఇండియా దర్శకుడు అయ్యారు. వీరి సినిమాల కోసం ఇప్పుడు ఇండియా అంతా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
సుకుమార్ “RC17” సీక్రెట్ వెనుక అసలు కథ!
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ రామ్ చరణ్ తో RC17 ప్లాన్ చేస్తున్నాడు. అయితే నిన్న పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్లో సుకుమార్ ని RC17 అప్డేట్ ఇమ్మని ఫ్యాన్స్ అడిగితే.. నేను చెప్పను, నాకు చెప్పడం ఇష్టం ఉండదు. మీరే ఊహించుకోండి. సారీ అని అన్నారు. సుకుమార్ తన సినిమాల గురించి ముందే ఏమి చెప్పారు. సినిమా మొదలయి అయిపోయాక ప్రమోషన్స్ కే బయటకు వస్తే కానీ ఆ సినిమా గురించి సుకుమార్ నోరు తెరవరు. దీంతో అసలు RC17 ఎలా ఉంటుంది? బ్యాక్ డ్రాప్, కథ ఏంటి ఇవన్నీ తెలియాలంటే చాలా కాలం ఎదురుచూడాల్సిందే మెగా ఫ్యాన్స్.
రెండు స్టైల్స్.. ఒకే లక్ష్యం: బాక్సాఫీస్ బద్దలు!
ఇది సుకుమార్ స్టైల్ అయితే రాజమౌళి స్టైల్ దీనికి పక్కా వ్యతిరేకం. రాజమౌళి అసలు తాను చేసే కథేంటో ముందే దానిపై ఒక హింట్ ఇచ్చేస్తాడు. ప్రతి సినిమాకు ఆ సినిమా లైన్ ఏంటో చెప్పేస్తారు రాజమౌళి. చెప్పేసి దాన్ని విజువల్ గ్రాండియర్ గా తీర్చిదిద్దుతారు. ఇప్పుడు వారణాసి కి కూడా ఈ సినిమా నిధి గురించి వెతకడం, ప్రపంచ యాత్ర గురించి, రెండు కాలాలను కలుపుతూ ఉంటుందని, ట్రెజర్ హంట్ లాంటి సినిమా అని RRR ప్రమోషన్స్ లోనే చెప్పేసాడు. దాంతో ఫ్యాన్స్ కథని అంచనా వేసినా వాళ్ళ ఊహలకు అందని విధంగా తీసి మెప్పిస్తాడు రాజమౌళి. ఇద్దరి స్టైల్స్ వేరైనా ఇద్దరూ సినిమా విషయానికొస్తే పని రాక్షసులే.
రాజమౌళి, సుకుమార్ ల విభిన్న స్టైల్స్ టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ ఇద్దరి సినిమాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి!


