
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతోంది.
- అరుణ్ జైట్లీ స్టేడియం, పీఎం ఆఫీస్, ఇండియా గేట్ వద్ద చిత్రీకరణ.
- రామ్ చరణ్ ప్రధాని మ్యూజియం సందర్శన, అధికారులతో భేటీ.
- బుచ్చిబాబు భారీ ప్రణాళికలపై అభిమానుల్లో ఆనందం.
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఢిల్లీలో జోరుగా జరుగుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. పీఎం ఆఫీస్, క్రికెట్ స్టేడియం వంటి ప్రదేశాలలో చిత్రీకరణ జరుగుతుండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీలో పెద్ది భారీ చిత్రీకరణ
Peddi : రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.(Peddi)
ఇప్పటికే పెద్ది సినిమా నుంచి ఓ సాంగ్, టీజర్ రిలీజ్ అయి భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ లో క్రికెట్ షాట్, చికిరి చికిరి సాంగ్ స్టెప్ బాగా వైరల్ అయ్యాయి. పెద్ది సినిమా మార్చ్ 27 రిలీజ్ కాబోతుంది. దీంతో సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
పీఎం ఆఫీస్‌లో షూటింగ్: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లోలో జరుగుతుంది. ఢిల్లీలో భారీగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు, ఏపీ భవన్, పార్లమెంట్ బయట వీధుల్లో, ఇండియా గేట్ వద్ద షూటింగ్ చేస్తున్నారట. అలాగే పీఎం ఆఫీస్ లో కూడా షూటింగ్ చేస్తున్నారట. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీ – ప్రధానమంత్రి సంగ్రహాలయలో కూడా షూటింగ్ చేస్తున్నారని సమాచారం.
ఆల్రెడీ రామ్ చరణ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీని సందర్శించి అక్కడ అధికారులను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RRR సినిమాతో రామ్ చరణ్ కి నార్త్ లో బాగా పేరొచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెద్ది షూటింగ్ జరుగుతుండటంతో భారీగా జనాలు చరణ్ ని చూడటానికి వచ్చారు. అక్కడి పోలీసులు కూడా చరణ్ తో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.
రామ్ చరణ్‌కు నార్త్ లో క్రేజ్
ఢిల్లీలో షూట్ చేయడం, ఏకంగా ఢిల్లీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేయడం, పీఎం ఆఫీస్ లో షూటింగ్ పెట్టడంతో బుచ్చిబాబు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఢిల్లీ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఢిల్లీలో, పీఎం ఆఫీస్ వంటి అరుదైన ప్రదేశాలలో ‘పెద్ది’ షూటింగ్ జరగడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. బుచ్చిబాబు ఆలోచనలు, రామ్ చరణ్ నటన ఈ చిత్రాన్ని ఎంత పెద్ద విజయం చేస్తుందో చూడాలి.


