|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది విడుదలపై రామ్ చరణ్ ఆగ్రహం! డైరెక్టర్, నిర్మాతలకు షాక్!

Published: 09-04-2026, 12:05 PM
పెద్ది విడుదలపై రామ్ చరణ్ ఆగ్రహం! డైరెక్టర్, నిర్మాతలకు షాక్!
  • రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సిన ‘పెద్ది’ సినిమా వాయిదా.
  • సినిమా విడుదల తేదీపై రామ్ చరణ్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
  • దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ లతో రామ్ చరణ్ విభేదాలు.
  • జూలై 26న సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై గందరగోళం నెలకొంది. రామ్ చరణ్ ఈ సినిమా విడుదల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం.

పెద్ది మూవీ విడుదల వాయిదాకు కారణం?

Peddi Movie:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన చిత్రాలలో ‘పెద్ది’ కూడా ఒకటి. ఎప్పుడో రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఇప్పుడు ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా పడింది. కనీసం ఈ తేదీకైనా సినిమా వస్తుందా అంటే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా వాయిదా పడినట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. జూలై 26వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ పై రామ్ చరణ్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. అటు దర్శకులకు నిర్మాతలకు మధ్య ఈ విషయంలో గందరగోళ సమస్యలు ఏర్పడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా దర్శకుడిగా ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సుకుమార్ (Sukumar) శిష్యుడు బుచ్చిబాబు సన (Bucchibabu Sana) దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా రాబోతున్న ఈ సినిమా తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.. ఐవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహానిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు, గ్లింప్స్ తో పాటు రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. అంతా బాగానే ఉన్నా ఇప్పుడు రామ్ చరణ్ అసంతృప్తి అభిమానులను నిరాశ పరుస్తోంది

రామ్ చరణ్ అసంతృప్తికి దారితీసిన పరిస్థితులు

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాల్లో రెండు పాటల చిత్రీకరణతో పాటు కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని సమాచారం. ఇక సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు ఇంకా కొనసాగుతున్నాయట. అటు క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని దర్శకుడు బుచ్చిబాబు భావిస్తుండడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది . అందుకే ఈ సినిమాను ఎలాగైనా సరే వాయిదా వేయాలి అని దర్శకుడు, మ్యూజిక్ దర్శకుడు కోరుతుంటే.. రామ్ చరణ్ ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఎలాగైనా సరే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయాలని రామ్ చరణ్ పట్టుబట్టారట. కానీ పనులు పూర్తికాకుండానే రిలీజ్ చేస్తే అవుట్ పుట్ దెబ్బతింటుందని మేకర్స్ భావిస్తుండడంతో రామ్ చరణ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

దర్శకుడు, నిర్మాతలకు మధ్య విభేదాలు?

ఇకపోతే సినిమా విడుదల తేదీపై అధికారికంగా ప్రకటించకపోయినా.. ఒకవేళ పెద్ది సినిమా ఏప్రిల్ 30న మిస్ అయితే మాత్రం కచ్చితంగా జూన్ 25 లేదా జూన్ 26 విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా అనుకున్న సమయానికి రాకుండా జూన్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తే మాత్రం ఆ సమయంలో విడుదల తేదీని ఖరారు చేసుకున్న అఖిల్ అక్కినేని లెనిన్ వంటి సినిమాలు మళ్లీ విడుదల తేదీని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమా రావడం కష్టమే అనిపిస్తోంది. ఇక మేకర్స్ నుండి క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

మొత్తానికి ‘పెద్ది’ సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఈ గందరగోళం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి. రామ్ చరణ్ అభిమానులు మాత్రం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.