
సమంత రూత్ ప్రభు నిర్మాణంలో వచ్చిన శుభం సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విజయవాడలోని థియేటర్లను సందర్శించిన సమంత ప్రేక్షకులతో మాట్లాడింది. రిమోట్ సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Key Points
శుభం సినిమాకు అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించింది.
విజయవాడ థియేటర్లలో సమంత సందడి చేసింది.
సినిమా యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
శుభం సినిమాకు అద్భుత స్పందన
స్టార్ హీరోయిన్, నిర్మాత సమంత రూత్ ప్రభు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ . మే9న ఈ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలిరోజున సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ఓపెనింగ్ డే నాడు సమంత శుభం సినిమా రూ. 1.5 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. రెండో రోజున కూడా అదే రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయవాడలో కొన్ని థియేటర్స్‌ను సందర్శించింది. విజయవాడ లోని థియేటర్లలో సమంత సందడి చేసింది.
హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తదితరులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ ధన్యవాదాలను తెలియజేసింది.
విజయవాడలో సమంత సందడి
శుభం లో నిర్మాతగానే కాకుండా, గెస్ట్ రోల్ పోషించిన సమంత ఎంటైర్ టీమ్ సాధించిన విజయం పట్ల గర్వంగా ఉన్నట్లు తెలియజేశారు. చిత్ర యూనిట్ అంతా ప్రతిభావంతులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలురని సమంత పేర్కొన్నారు.
శుభం సినిమాలో శ్రావణి తన భర్త పాత్రలో నటించిన శ్రీనివాస్ గవిరెడ్డిని రిమోట్ కావాలనే సన్నివేశం తనకెంతో ఇష్టమని సమంత తెలియజేసింది. దీంతో థియేటర్లలో ఫ్యాన్స్ అరుపులతో గోల చేశారు. “ఈ సీన్‌కు ఎంతో కనెక్ట్ అయిన ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో సమంత సినిమాలో నటించిన నటీనటులకు.. ఏదో సాధించాలనే వారిలో తపన, ఏదో నేర్చుకోవాలనే వారి మనస్తత్వాలను అలాగే కొనసాగించాలి” అంటూ సమంత సలహానిచ్చారు.
సినిమాలో తను చేసిన గెస్ట్ అప్పియరెన్స్‌లో నటించటంపై సమంత స్పందిస్తూ “నేను క్యామియో చేయాలని ముందుగా అనుకోలేదు. షూటింగ్ ముందు రోజు కూడా చేయననిచెప్పాను. అయితే ఇప్పుడు ఆ సన్నివేశంలో నటించటంపై చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు.
రిమోట్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది
ఇక ఇన్‌స్టా లైవ్ చివరలో శుభం మూవీలో మరిడేష్ పాత్రలో నటించిన నటుడు రాగ్ మయూర్ కనిపించారు. తనకంటే సినిమా బండిలో మరిడేష్ బాబు పాత్రలో నటించిన మెప్పించిన రాగ్ మయూర్ ఎంట్రీకే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని సమంత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మంచి కథ, కథనం, ఊహించని ట్విస్ట్‌లు, హాస్యం, సస్పెన్స్‌ల కలయికతో రూపొందిన శుభం సినిమాలో నటించటం గురించి తమ అనుభవాలను పంచుకోవాలని నటీనటులను సమంత కోరగా, వారు తమ అనుభవాలను ప్రేక్షకులకు తెలియజేస్తూ శుభం సినిమా జర్నీలో తామెంతో ఎంజాయ్ చేశామని వారు తెలియజేశారు.
శుభం సినిమా విజయం సమంతతో పాటు మొత్తం చిత్రయూనిట్ కృషి ఫలితం. ప్రేక్షకుల ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలిపారు.


