|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంతకు పబ్లిక్ లో ఘోర అవమానం: సెలబ్రిటీల భద్రతకు ఇదేం దౌర్భాగ్యం?

Published: 22-12-2025, 1:04 AM
సమంతకు పబ్లిక్ లో ఘోర అవమానం: సెలబ్రిటీల భద్రతకు ఇదేం దౌర్భాగ్యం?
  • సమంతకు జూబ్లీహిల్స్ షోరూమ్ ఓపెనింగ్‌లో అవమానం.
  • సెల్ఫీల కోసం అభిమానుల తాకిడితో ఇబ్బంది పడ్డ సమంత.
  • నిధి అగర్వాల్ ఘటనతో పోలుస్తూ వైరల్ అవుతున్న వీడియోలు.
  • హీరోయిన్ల భద్రతపై నిర్వాహకుల బాధ్యతను ప్రశ్నిస్తున్న నెటిజన్లు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు జూబ్లీహిల్స్‌లోని ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల తాకిడితో ఆమె చాలా ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన వీడియో వైరల్ కాగా, సెలబ్రిటీల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది.

సమంతకు జూబ్లీహిల్స్ లో చేదు అనుభవం

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఘోర అవమానం జరిగింది. ఆమె రీసెంట్ గా జూబ్లీహిల్స్ లోని షోరూం ఓపెనింగ్ కి గెస్ట్ గా వెళ్లారు. ఆ షో రూమ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఆమె తిరిగి మళ్లీ బయటకు రాబోతుంటే జనాలు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు చుట్టుముట్టారు. సమంత ఎంతో ఓపికగా అక్కడ ఉన్న వారికి సెల్ఫీలు ఇచ్చింది. అయినా కూడా కొంతమంది ఆకతాయిలు ఆమెని తాకెందుకు ముందుకు వచ్చారు. అది గమంచిన సెక్యూరిటీ వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. నా పర్సనల్ సెక్యూరిటీతో చాలా ఇబ్బంది పడుతూ బయటికి వచ్చేసింది సమంత.. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ వీడియోలను చూసిన సమంత అభిమానులు ఫీల్ అవుతున్నారు.. ఇక నెటిజన్లు మొన్న నిధి అగర్వాల్ కు, నేడు సమంతకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం దారుణం అన్ని కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్లను ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వాళ్ళని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ కార్యక్రమా నిర్వాహకుల మీద ఉంటుంది. కానీ వాళ్లిలా సెక్యూరిటీని పెంచక పోవడం వల్లే హీరోయిన్లకు రక్షణ లేకుండా పోతుంది అని మరికొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది…

వైరల్ అవుతున్న వీడియోలు.. నెటిజన్ల ప్రశ్నలు

సెలబ్రిటీల భద్రతపై ఆందోళన

సమంతకు ఎదురైన అవమానం సెలబ్రిటీల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. కార్యక్రమ నిర్వాహకులు, అభిమానులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.