
టాలీవుడ్ నటి సమంత తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న వీడియో వైరల్ అవడంతో, రాజ్ భార్య శ్యామలి చేసిన పోస్ట్ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
Key Points
సమంత, రాజ్ నిడిమోరు కలిసి పికిల్ బాల్ ఆడుతున్న వీడియో వైరల్
రాజ్ భార్య శ్యామలి, సమంత-రాజ్ డేటింగ్ వార్తలపై స్పందించారు
'కాలమే అన్ని నిర్ణయిస్తుంది' అంటూ శ్యామలి ఇన్‌స్టా స్టోరీ పోస్ట్
ఇద్దరూ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' లో కలిసి పనిచేస్తున్నారు
సమంత, రాజ్ నిడిమోరు వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా చేసిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది. జిమ్‌లో వర్కవుట్స్‌తో పాటు పికిల్ బాల్ ఆడుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. అలా మరోసారి ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఇటీవల శుభం మూవీ రిలీజ్ తర్వాత విమానంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను సామ్ షేర్ చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.
రాజ్ భార్య శ్యామలి స్పందన
తాజాగా ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఆమె వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలపై పరోక్షంగా స్పందించారు.
‘శుభం’ సినిమా తర్వాత వార్తలు
కాగా.. శుభం మూవీ సక్సెస్ తర్వాత విమానంలో సమంత షేర్ చేసిన ఫోటో చూశాకే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. శుభం సక్సెస్ మీట్‌లోనూ రాజ్ నిడిమోరు కనిపించారు. అంతకుముందు ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ ఇప్పటివరకు తమపై వస్తున్న వార్తలపై సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు. మరోవైపు సమంత, రాజ్ ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, వామికా గబ్బి, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


