|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత, రాజ్ పికిల్‌బాల్ రచ్చ: రొమాంటిక్ డేట్‌తో దుమ్ము రేపారు! వైరల్ వీడియో చూస్తే షాకే!

Published: 17-01-2026, 10:30 AM
సమంత, రాజ్ పికిల్‌బాల్ రచ్చ: రొమాంటిక్ డేట్‌తో దుమ్ము రేపారు! వైరల్ వీడియో చూస్తే షాకే!
  • సమంత, రాజ్ నిడిమోరుల రొమాంటిక్ పికిల్‌బాల్ డేట్ వీడియో వైరల్! నెటిజన్ల నుండి హార్ట్ ఎమోజీల వర్షం.
  • డిసెంబర్ 1, 2025న అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్‌గా సమంత, రాజ్ వివాహం జరిగింది.
  • విడాకుల తర్వాత రాజ్ నిడిమోరుతో సమంత కొత్త జీవితం ప్రారంభం.. అభిమానుల్లో ఆనందం!
  • సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ టీజర్ విడుదల.. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో అదరగొడుతోంది!

సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్‌బాల్ ఆడుతూ కనిపించడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరూ కలిసి రొమాంటిక్ డేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పికిల్‌బాల్ ఆడుతూ సమంత, రాజ్ సందడి

సమంత  తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నచ్చిన ప్రదేశాలకు వెళ్తు..నచ్చిన ఆటలు ఆడుతూ.. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తాజాగా సమంత తన భర్త రాజ్ తో కలిసి రొమాంటిక్ స్పోర్ట్స్ డేట్ చేసింది.   ఈ వీడియోలో సమంత, రాజ్ డబుల్స్ ఆడుతూ కనిపించారు.  కొన్ని షాట్లు మిస్ అయినా, వాళ్ళ సమన్వయం ఈ వీడియోకి హైలైట్. ఈ జంటను చూసి చాలా మంది అభిమానులు హార్ట్ ఎమోజీలతో స్పందించారు.

Samantha Ruth Prabhu & Raj Nidimoru serving couple goals with smiles, comfort, and calm love. ❤️✨ #SamanthaRuthPrabhu #RajNidimoru #CoupleGoals #CelebrityLove pic.twitter.com/gSnTx2Zowd

— Thegossipgully.com (@thegossipgully) January 17, 2026

సమంత, రాజ్ నిడిమోరుల సింపుల్ వెడ్డింగ్

భర్త రాజ్ నిడిమోరుతో తన మొదటి సంక్రాంతి పండుగ ఫొటోను సమంత అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో, స్టార్ హీరోయిన్  ఫన్నీ ఫేస్ పెట్టగా, రాజ్ నవ్వును దాచుకున్నాడు. ఈ చూడముచ్చటైన ఫోటోకు అభిమానుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్ట్‌లలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు. వీరు డిసెంబర్ 1, 2025న కేవలం 30 మంది బంధుమిత్రుల  సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి పిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.

‘మా ఇంటి బంగారం’ టీజర్‌తో సమంత దుమ్మురేపింది

సమంతకు గతంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యతో వివాహం జరిగింది. దాదాపు 7 ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. 2017 లో పెళ్లి చేసుకుని.. మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు.  చైతన్య తర్వాత నటి శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నారు. రాజ్ నిడిమోరుకు గతంలో శ్యామలి దేతో వివాహమైంది. వీరు కూడా విడాకులు తీసుకున్నారు.

సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ టీజర్ విడుదలైంది. ఇది డ్రామా, హై-ఆక్టేన్ యాక్షన్‌తో కూడిన కథ. ఇందులో సమంత ఒక సంక్లిష్టమైన పాత్రలో కఠినంగా కనిపిస్తుంది. ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తోంది. సినిమాలతో పాటు పలు వ్యాపారాల ద్వారా కూడా ఆమె సంపాదిస్తోంది.

సమంత, రాజ్ నిడిమోరుల జంట టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.