
టాలీవుడ్ స్టార్ సమంత తాజాగా తన బేబీ బంప్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో ‘శుభం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగం. వీడియో వైరల్‌గా మారడంతో సమంత వార్తల్లో నిలిచింది.
Key Points
సమంత తన బేబీ బంప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ వీడియో 'శుభం' మూవీ ప్రమోషన్స్‌లో భాగం.
సమంత 'శుభం' మూవీ నిర్మాణంలో పాల్గొంటోంది.
సమంత బేబీ బంప్ వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు గతంలో తెలుగు స్టార్స్ అందరీ సరసన నటించి కొద్ది కాలంపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. చివరగా ‘ఖుషి’(Khushi) మూవీలో కనిపించింది. అయితే సామ్‌కు మయోసైటీస్ రావడంతో ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ సమంత హీరోయిన్‌గా సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. ఈక్రమంలోనే సామ్ నిర్మాతగా మారబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ట్రాలాలా బ్యానర్‌పై ‘శుభం’(shubam) చిత్రాన్ని నిర్మించబోతుంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచారు.
ఈ మేరకు వరుస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె సినిమాలోని ఓ పాట స్టెప్ వేస్తూ అంతా ‘శుభం’ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలను షేర్ చేస్తూ వారికి థాంక్స్ చెబుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ బేబీ బంప్ వీడియోను షేర్ చేస్తూ క్యూటెస్ట్ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే సుహానా ప్రెగ్నెంట్ కావడంతో సమంత కోసం ‘శుభం’ ప్రమోషన్స్ చేస్తోంది. నా బేబీతో.. నేను సమంత బేబీ కోసం ఈ వీడియో చేస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్‌కు సమంత షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సడెన్‌గా చూసిన వారంతా సమంతనే అనుకుంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా, సమంత సినిమాలు చేయనప్పటికీ ఓ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి అందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది. నిత్యం పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.
‘శుభం’ మూవీ ప్రమోషన్స్
సోషల్ మీడియాలో సంచలనం
చివరగా, సమంత బేబీ బంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఆమె అభిమానులను ఆకట్టుకుంది. ‘శుభం’ మూవీ ప్రమోషన్స్‌కు ఇది మంచి ప్రచారం అని చెప్పవచ్చు.


