
📌 Key Points
- సమంత లేటెస్ట్ లుక్: ఫ్యాన్స్ ఆందోళన!
- ‘మా ఇంటి బంగారం’ మూవీలో సమంత, గుల్షన్ దేవయ్య!
- నందిని రెడ్డి దర్శకత్వంలో భారీ చిత్రం!
- సంతోష్ నారాయణన్ సంగీతం: సినిమాపై అంచనాలు!
సమంత తాజా ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ‘మా ఇంటి బంగారం’ మూవీ అప్‌డేట్స్‌తో మీ ముందుకు.
సమంత షేర్ చేసిన షాకింగ్ ఫోటో!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.
ఆ తర్వాత రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది. ప్రస్తుతం సామ్ ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, కన్నడ స్టార్ హీరో దిగంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
‘మా ఇంటి బంగారం’ మూవీ విశేషాలు
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సామ్ తన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది. అందులో మెలకన్నులా ఫోజు పెట్టిన ఫొటోతో పాటు కోతి నవ్వుతున్న పిక్ షేర్ చేసింది. ఇక దీనికి ‘థాంక్స్ ఫర్ ఆల్ లవ్’ అని మా ఇంటి బంగారం మూవీను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన ఫ్యాన్స్ అయ్యో ఏమైంది సామ్ ఫేస్ అలా పెట్టావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ కామెంట్స్.. ఏమైంది సామ్?
A post shared by Samantha (@samantharuthprabhuoffl)
సమంత కొత్త సినిమా మరియు ఆమె ఆరోగ్యం గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.


