
ప్రముఖ సింగర్ చిన్మయి మరియు రాహుల్ దంపతులు సమంత నిర్మించిన ‘శుభం’ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారి పిల్లలు కూడా డ్యాన్స్‌లో పాల్గొన్నారు. ఈ వీడియోకు నెటిజన్లు చేస్తున్న ఫన్నీ కామెంట్లు ఆకట్టుకుంటున్నాయి.
Key Points
రాహుల్-చిన్మయి దంపతులు సమంత సినిమా పాటకు డ్యాన్స్ చేశారు.
చిన్మయి డ్యాన్స్ బాగుంది, కానీ రాహుల్ డ్యాన్స్ కష్టపడినట్టు ఉంది.
నెటిజన్లు రాహుల్ డ్యాన్స్ పై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
రాహుల్-చిన్మయి దంపతుల డ్యాన్స్ వీడియో వైరల్
స్టార్ కపుల్ రాహుల్(Rahul)- చిన్మయి(Chinmayi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. లవ్ చేసుకున్న ఈ జంట ఇంట్లో పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక వీరికి ఒక పాప, బాబు(ట్విన్స్). సింగర్ చిన్మయి సమంత(Samantha)కు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తమ పిల్లల ఫొటోస్, వీడియోస్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు.
చిన్మయి అద్భుతమైన డ్యాన్స్
ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో సమంత నిర్మాతగా నిర్మిస్తున్న ‘శుభం’(Subham) సినిమాలోని ఓ స్టెప్‌ను ఈ జంట రీ క్రియేట్ చేశారు. వీరిద్దరే కాకుండా వీరి పిల్లలు కూడా ఆ స్టెప్పుకు చిందులేశారు. అయితే చిన్మయి డ్యాన్స్ బాగానే వేసింది. కానీ రాహుల్ మాత్రం డ్యాన్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కింద నెటిజన్లు.. చిన్మయి డ్యాన్స్ బాగా చేసింది, కానీ రాహుల్ మిక్సీలో బ్లేడ్ తిరుగుతున్నట్లు తిప్పుతున్నారని, అది డ్యాన్స్ లాగా లేదని స్టీరింగ్ తిప్పుతున్నట్టుగా ఉందని తెగ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
రాహుల్ డ్యాన్స్ పై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)
చివరగా, రాహుల్ మరియు చిన్మయి దంపతుల డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు వారి డ్యాన్స్ పై చేసిన ఫన్నీ కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


