|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విలన్.. బాధితురాలిగా ఏం యాక్ట్ చేసిందిలే.. సమంత స్టైలిస్ట్ సాధన సింగ్ పోస్ట్.. ఎవరా విలన్?

Published: 02-12-2025, 3:10 AM
విలన్.. బాధితురాలిగా ఏం యాక్ట్ చేసిందిలే.. సమంత స్టైలిస్ట్ సాధన సింగ్ పోస్ట్.. ఎవరా విలన్?
  • సమంత-రాజ్ నిడిమోరుల వివాహం ఇటీవల కోయంబత్తూర్ లోని ఈశా ఆశ్రమంలో జరిగింది.
  • సమంత రెండవ పెళ్లిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
  • స్టైలిస్ట్ సాధన సింగ్ ‘విలన్ బాధితురాలిగా నటించింది’ అంటూ సంచలన పోస్ట్ చేసింది.
  • పోస్ట్ చేసిన వెంటనే సాధన సింగ్, సమంతను అన్‌ఫాలో చేసింది.

సమంత-రాజ్ నిడిమోరుల వివాహం అనంతరం నెగిటివ్ కామెంట్లు పెరిగాయి. తాజాగా సమంత స్టైలిస్ట్ సాధన సింగ్, ‘విలన్ బాధితురాలిగా నటించింది’ అంటూ సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఎవరా విలన్ అంటూ చర్చ మొదలైంది.

సమంత రెండవ పెళ్లిపై వివాదం

Sadhna Singh: గత కొంత కాలంగా సమంత, దర్శకుడు రాజ్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలు నేపధ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ ఇద్దరు. తాజాగా సమంత-రాజ్ నిడిమోరు కోయంబత్తూర్ లోని ఈశా ఆశ్రమంలో జరిగింది. ఇక పెళ్లి అనంతరం సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలను రిలీజ్ చేసి పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. దీంతో నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సమంత రెండవ పెళ్లిపై నెగిటీవ్ కామెంట్స్ కూడా ఒక రేంజ్ లో వస్తున్నాయి.

స్టైలిస్ట్ సాధన సింగ్ సంచలన పోస్ట్

Samantha-Raj: సమంత వెడ్డింగ్ రింగ్ చాలా స్పెషల్.. ఆ నాలుగు అంశాలకు ప్రతీకగా.. ప్రేమను, బంధాన్ని మేళవిస్తూ..

నెటిజన్స్, ఇండస్ట్రీలో చర్చ

ఇప్పటికే ఈ పెళ్లిపై నటి పూనమ్ కౌర్, రాజ్ నిడిమోరు మొదటి భార్య నెగిటీవ్ కామెంట్స్ చేయగా.. తాజాగా ఈ లిస్టులో సమంత స్టైలిస్ట్‌ సద్నా సింగ్‌(Sadhna Singh) చేరింది. ఆమె సైతం తన సోషల్ మీడియాలో సమంత పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసింది. ‘బాధితురాలిగా.. విలన్‌ చాలా బాగానే నటించింది’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది. దీంతో ఆమె పెట్టిన ఈ స్టోరీ వైరల్ అయ్యింది. అలాగే, స్టోరీ పెట్టిన అనంతరం సమంతను అన్‌ఫాలో చేసింది సద్నా సింగ్‌. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సమంతను విలన్ అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెటిజన్స్ సైతం ఈ పోస్టులు చూసి షాక్ అవుతున్నారు. అసలు సమంత బాదితురాలా.. విలనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సాధన సింగ్ పోస్ట్ సమంత పెళ్లి చుట్టూ కొత్త వివాదాన్ని రేపింది. ‘విలన్’ ఎవరు అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో, నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.