|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత టీవీఎస్ సీక్రెట్ లీక్! ‘మా ఇంటి బంగారం’ మేకింగ్ వీడియోతో షాకింగ్ నిజం!

Published: 28-06-2026, 2:16 AM
సమంత టీవీఎస్ సీక్రెట్ లీక్! ‘మా ఇంటి బంగారం’ మేకింగ్ వీడియోతో షాకింగ్ నిజం!
  • ‘మా ఇంటి బంగారం’ 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో అదరగొట్టింది, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
  • సమంత టీవీఎస్ డ్రైవింగ్ సీన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు వైరల్ వీడియోతో బయటపడింది.
  • శ్రీముఖి యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన మేకింగ్ షార్ట్స్ ఫ్యాన్స్‌కు కొత్త విషయాలు చూపాయి.
  • టాలీవుడ్ దర్శక-నిర్మాతలు యాక్షన్ సీన్స్‌ని ఎలా చిత్రీకరిస్తారో ఈ వీడియోతో స్పష్టమైంది.

సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఆమె చేసిన ఓ యాక్షన్ సీన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది. వైరల్ అవుతున్న మేకింగ్ వీడియో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

సమంత డ్రైవింగ్ సీక్రెట్ ఏంటి?

Samantha : సమంత ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటికే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది. అలాగే ఈ సినిమాలో సమంత చాలా సీన్స్ లో కార్, టీవీఎస్ డ్రైవ్ చేస్తుంది.

టీవీఎస్ మీద శ్రీముఖిని ఎక్కించుకొని ఊరంతా తిప్పే ఓ సీన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. అయితే ఆ సీన్ లో సమంత నిజంగా టీవీఎస్ తోలలేదు అని ఇప్పుడు ఓ మేకింగ్ వీడియోతో తెలిసిపోయింది. యాంకర్ శ్రీముఖి తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మా ఇంటి బంగారం మేకింగ్ వీడియోలు షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తుంది.

మేకింగ్ వీడియోలో అసలు నిజం!

సినిమాలో శ్రీముఖిని ఎక్కించుకొని సమంత టీవీఎస్ తొలి సీన్ ని ఎలా షూట్ చేసారో కూడా పోస్ట్ చేసింది. ఓ వెహికల్ కి కెమెరా సెటప్ పెట్టి ఆ వెహికల్ కి ఒక ట్రాలీని కట్టారు. ఆ ట్రాలీ మీద టీవీఎస్ పెట్టారు. ఆ టీవీఎస్ పైన సమంత, శ్రీముఖి కూర్చున్నారు అంతే. వెహికల్ ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్ గా ఆ ట్రాలీ కూడా వస్తుంది. దీంతో సమంత టీవీఎస్ తోలినట్టు హావభావాలు ఇస్తే సరిపోతుంది. ఈ వీడియోతో సమంత ఈ సినిమాలో రియల్ గా టీవీఎస్ తోలలేదు అని తెలుస్తుంది.

టాలీవుడ్ టెక్నిక్స్ రివీల్!

చాలా సినిమాల్లో నటీనటులకు డ్రైవింగ్ రాకపోతే సీన్స్ ఇలాగే షూట్ చేస్తారు. ఒక ట్రాలీ మీద బండి పెట్టి దానిపై కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్టు హావభావాలు ఇస్తారు నటీనటులు. డ్రైవింగ్ వస్తే మాత్రం వాళ్ళు డ్రైవ్ చేస్తూ యాక్టింగ్ చేస్తుంటే ముందు వెహికల్ లో కెమెరా సెటప్ పెడతారు. ఒక్కోసారి డ్రైవింగ్ వచ్చినా సేఫ్టీ కోసం కూడా ఇలాగే షూట్ చేస్తారు. ప్రస్తుతం సమంత, శ్రీముఖి మా ఇంటి బంగారం మేకింగ్ వీడియో వైరల్ గా మారింది.

సమంత టీవీఎస్ డ్రైవింగ్ సీక్రెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి ఆసక్తికరమైన సినిమా విశేషాలు, లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవుతూ ఉండండి! మరిన్ని సంచలన వార్తలతో మళ్ళీ కలుద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.