
📌 Key Points
- సమంత ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది.
- కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వారి వివాహం జరిగింది.
- పెళ్లైన చాలా రోజుల తర్వాత ఆమె మెహందీ, పెళ్లి ఫొటోలను షేర్ చేసింది.
- ఈ ఫొటోలపై నెటిజన్స్ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన చాలా రోజుల తర్వాత ఆమె షేర్ చేసిన పెళ్లి, మెహందీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు.
సమంత కొత్త జీవితం…రాజ్ నిడిమోరుతో వివాహం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది.
నిర్మాతగా సామ్ కొత్త ప్రయాణం
ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే.. రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని ఈ చిన్నదే స్వయంగా తమ పెళ్లి ఫొటోలు షేర్ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. ఇక మ్యారేజ్ తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీ అయిపోయింది సమంత. సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు.. నెటిజన్స్ రియాక్షన్
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తమ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది సమంత. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇక వాటికి.. ‘ఎ ఇయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్’అనే క్యాప్షన్ జోడించింది. అయితే ఫొటోస్ విషయానికి వస్తే ఈ ఇయర్‌లో తనకు హ్యాపీనెస్ కలిగించిన అన్ని ఫొటోలను షేర్ చేసింది. తన మెహందీ, పెళ్లి, ఆల్ కెమిస్ట్ పర్‌ఫ్యూమ్, శుభం మూవీ సక్సెస్, రాజ్ నిడుమోరుతో తీసుకున్న ఫొటోలు ఇలా చాలా పిక్స్ షేర్ చేసింది. అయితే పెళ్లైనా ఇన్ని డేస్‌కు మెహందీ ఫొటో షేర్ చేయడంతో నెటిజన్స్ సామ్ బేబీ ఇప్పుడా షేర్ చేసేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని సంబంధించిన పోస్ట్‌ను మీరు కూడా చూసేయండి.
సమంత తన వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలను పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు అభిమానులలో చర్చకు దారితీశాయి. ఆమె కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


