
📌 Key Points
- సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా పిక్చర్స్’లో ‘మా ఇంటి బంగారం’ మూవీ.
- ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ లుక్ విడుదల.. ఇంటెన్స్ లుక్‌లో సమంత రచ్చ.
- ట్రైలర్ జనవరి 9న ఉదయం 10 గంటలకు రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటన.
- నందిని రెడ్డి దర్శకత్వంలో, రాజ్ నిడిమోరు కథతో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం.
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు అదిరిపోయే వార్త. మయోసైటీస్ నుండి కోలుకున్న తర్వాత నిర్మాతగా, నటిగా డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమైంది. పెళ్లైన నెలకే తన కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. ఈ అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
డబుల్ ధమాకా ఇవ్వనున్న సమంత.. ట్రాలాలా పిక్చర్స్ ప్లానింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా గత రెండేళ్లుగా సినిమాలకు విరామం తీసుకుంది.. ఆ సమయంలో పూర్తిగా కోలుకోవడంపై ఫోకస్ పెట్టింది. అలాగే వ్యక్తిగత జీవితంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులు దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం సాగించి, గత ఏడాది డిసెంబర్ 1న సింపుల్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నటిగా రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా నిర్మాతగా కూడా తనదైన మార్క్ వేయాలని సమంత డిసైడ్ అయింది. అందుకే ట్రాలాలా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి మొట్టమొదటి మూవీ ‘శుభం’ తో హిట్ అందుకుంది. ఇక అదే బ్యానర్‌లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’ (maa inti bangaram). లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నందినిరెడ్డి (Nandini Reddy )దర్శకత్వం వహిస్తోంది.
‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ లుక్.. రచ్చ మామూలుగా లేదు!
కథను మాత్రం రాజ్ నిడిమోరు అందిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీనిని స్వయంగా సమంతనే తన ట్రాలాలా పిక్చర్స్‌పై నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సమంత కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన మూవీగా నిలవనుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో సమంత పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘మా ఇంటి బంగారం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు, ట్రైలర్‌ను జనవరి 9న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇంటెన్స్ లుక్‌లో సమంత.. అభిమానులు షాక్!
ఇక విడుదలైన ఫస్ట్ లుక్‌లో బస్సులో నిల్చుని చీరకట్టులో కనిపించిన సమంత.. కళ్లలో కోపంతో చాలా ఇంటెన్స్‌గా కనిపించింది. ఈ పోస్ట్‌కు “మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది” అనే క్యాప్షన్ జత చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఇక అది చూసిన నెటిజన్లు.. ఇప్పటివరకు గ్లామర్, సాఫ్ట్ రోల్స్‌లో కనిపించిన సమంతకు ఇది పూర్తిగా డిఫరెంట్ అవతార్ అని అభిమానులు అంటున్నారు. మరికొందరు.. ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ పెడుతుంటే.. సమంత ఇంత స్ట్రాంగ్ లుక్‌లో కనిపించడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ డేట్ ఫిక్స్.. రెడీగా ఉండండి!
A post shared by Samantha (@samantharuthprabhuoffl)
సమంత ‘మా ఇంటి బంగారం’తో అటు నిర్మాతగా, ఇటు నటిగా సంచలనం సృష్టించడం ఖాయం. ఆమె ఇంటెన్స్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. త్వరలోనే రానున్న ట్రైలర్, మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి.


