
📌 Key Points
- శివాజీ నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేటర్లలో విడుదలైంది.
- ఈ చిత్రం ‘దృశ్యం’ సినిమాను పోలి ఉంటుందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.
- అనిల్ రావిపూడి కామెడీ టచ్ ఇచ్చినప్పటికీ, ఎంటర్టైన్మెంట్ కన్సిస్టెంట్ గా లేదని అంటున్నారు.
- శివాజీ, లయ కాంబినేషన్ గతంలో హిట్లు అందించినా, ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా దృశ్యం సినిమాను పోలి ఉందని, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆశించిన స్థాయిలో లేదని పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథా నేపథ్యం, విశ్లేషణ
Sampradayini Suppini Suddapoosani Review: శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్ళిపోతున్నాడు. అతను ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ సినిమా అయినప్పటికీ కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకొచ్చారు. మరి వారి కాన్ఫిడెన్స్ ఎంత బలమైనదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ: శ్రీరామ్ (శివాజీ) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. పంచాయతీ సెక్రెటరీగా పని చేసుకుంటూ వచ్చిన జీతంతో తన కుటుంబంతో హ్యాపీగా గడపాలి అనుకునే మనస్తత్వం అతనిది. అయితే శ్రీరామ్ భార్య ఉత్తర (లయ) అతన్ని లంచాలు తీసుకుని కాస్ట్ లీ లైఫ్ గడుపుదాం అంటూ అతన్ని సతాయిస్తూ ఉంటుంది. మరోపక్క కొడుకు(బిట్టు) చేసే పనుల వల్ల నిత్యం టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఒకసారి విక్రమ్ వాసుదేవ్(ప్రిన్స్) అనే వ్యక్తితో శ్రీరామ్ కి ఒక గొడవ అవుతుంది. దీంతో శ్రీరామ్ పై విక్రమ్ పగ పెంచుకుంటాడు. ఇందులో భాగంగా ఒకసారి శ్రీరామ్ లేని టైం చూసుకుని ఉత్తర పై బలాత్కారానికి పాల్పడతాడు. బిట్టు అతన్ని అడ్డుకుంటాడు. ఈ క్రమంలో ఊహించని విధంగా ప్రమాదవశాత్తు విక్రమ్ చనిపోతాడు.తర్వాత విషయం తెలుసుకున్న శ్రీరామ్.. ఆ డెడ్ బాడీని మాయం చేసి తన ఫ్యామిలీని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నం ఫలించిందా? తర్వాత శ్రీరామ్ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి.? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ : కథ చదివిన ఎవ్వరికైనా ఇది కొత్తగా అనిపిస్తుందా? సుధీర్ శ్రీరామ్ కొత్త పాయింట్ అయితే తీసుకోలేదు. వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ కథకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్న సినిమా ఇది. కాకపోతే.. అలాంటి కథని అనిల్ రావిపూడి స్టైల్ కామెడీతో చెప్పాలని ట్రై చేశాడు. వాస్తవానికి ఇది ఓటీటీ సినిమా. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ కి గెస్ట్ గా వచ్చి ‘ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది’ అని అన్నాడు కదా అని..మేకర్స్ థియేటర్ కి తీసుకొచ్చారు. శివాజీ, లయ కాంబోలో చాలా హిట్లు వచ్చాయి. కాబట్టి థియేటర్ కి తెస్తే..క్యాష్ చేసుకోవచ్చు అనే ఆశ వాళ్లకు కలిగింది. కరెక్ట్.. కానీ ముందుగా ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించకుండా ఉండాల్సింది. అక్కడక్కడా కొంత ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ అది కన్సిస్టెంట్ గా లేకపోవడం మైనస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ తర్వాత అందరం ఊహించినట్టే కథనం సాగుతుంది. ట్విస్టులు వంటివి కూడా ముందుగానే ఊహించే విధంగా ఉంటాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోలేదు. సంక్రాంతి హాలిడేస్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించేలా ఒక్క సినిమా కూడా ధియేటర్లోకి రాలేదు. వాళ్ళ ముచ్చట కొంతవరకు తీర్చే విధంగా ఈ సినిమా ఉంటుంది.
నటీనటుల నటన ఎలా ఉంది?
నటీనటుల విషయానికి వస్తే.. శివాజీ బాగా చేశాడు. కొన్ని వన్ లైనర్స్ కూడా అతను పలికిన విధానం బాగుంది. లయ ఎప్పటిలానే హుందాగా స్క్రీన్ పై కనిపించింది. ఆమె నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది? కాకపోతే ఈ సినిమాలో ఆమెలోని వయొలెంట్ యాంగిల్ ని బయటపెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ ఎందుకో ఈ పాత్రకి సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. 90’s క్రేజ్ ను వాడుకోవాలని అతన్ని తీసుకున్నారేమో కానీ.. బుల్లిరాజు అలియాస్ రేవంత్ అయితే బాగా సూట్ అయ్యేవాడేమో. ధనరాజ్ కి కొంచెం కొత్త పాత్ర దొరికింది. బాగానే చేశాడు. ప్రిన్స్, చిత్రం శ్రీను వంటి వాళ్ళు ఓకే అనేలా చేశారు.
కొన్ని కామెడీ సన్నివేశాలు
సినిమా చూడొచ్చా లేదా?
మొత్తంగా ఈ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓ సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్లకు ఓటీటీలో బెటర్ అనే ఫీలింగ్ ఇస్తుంది.
మొత్తానికి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం దృశ్యం సినిమాను గుర్తు చేస్తుంది. కామెడీ అక్కడక్కడ నవ్వించినా, ఓవరాల్‌గా ఆశించినంతగా లేదు. కుటుంబ సమేతంగా చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయవచ్చు.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online