
📌 Key Points
- Samsung Galaxy M17e 5G: 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో చౌకైన ధరలో లభిస్తుంది.
- భారత మార్కెట్లో రూ. 13,999 నుంచి ప్రారంభ ధరతో 4GB RAM వేరియంట్ అందుబాటులో ఉంది.
- ఈ ఫోన్ 6.58-అంగుళాల HD+ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
- Samsung.com, Amazon వంటి ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy M17e 5G భారత మార్కెట్లోకి విడుదల అయింది. ఈ ఫోన్ 50MP కెమెరా మరియు 6,000mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర చాలా తక్కువగా ఉండటం విశేషం. ఇది వినియోగదారులకు ఒక గొప్ప ఎంపిక అవుతుంది.
Samsung Galaxy M17e 5G ధర మరియు లభ్యత
Samsung Galaxy M17e : శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అత్యంత సరసమైన ధరలో కొత్త శాంసంగ్ గెలాక్సీ M17e ఫోన్ లభిస్తోంది. 6000mAh భారీ బ్యాటరీతో 50MP కెమెరాతో ఆకట్టుకుంటోంది. సేల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy M17e : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అత్యంత సరసమైన శాంసంగ్ గెలాక్సీ M17e 5G సేల్ మొదలైంది. కంపెనీ సరసమైన M-సిరీస్ లైనప్‌లో లాంచ్ చేసింది.
డైమెన్సిటీ 6000-సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6GB వరకు ర్యామ్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M17e 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
శాంసంగ్ గెలాక్సీ M17e 5G ధర : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ఫోన్ 4GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. 6GB ర్యామ్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 15,499 నుంచి అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy M17e 5G ఫీచర్లు
ఆసక్తిగల వినియోగదారులు రూ. 1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ సేల్ ధర రూ. 12,499కి తగ్గుతుంది. బ్లిట్జ్ బ్లూ, వైబ్ వైలెట్ అనే 2 కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. Samsung.com, Amazon సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M17e 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : డ్యూయల్-సిమ్ (నానో + నానో) శాంసంగ్ గెలాక్సీ M17e 5G, ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ8పై రన్ అవుతుంది. 6 OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి.
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) PLS LCD స్క్రీన్ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. 6GB వరకు ర్యామ్, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తుంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజ్‌ను 2TB కెపాసిటీ వరకు విస్తరించవచ్చు.
Read Also : Gold Price Today : పసిడి ప్రియులకు పండగే.. మళ్లీ కుప్పకూలిన బంగారం.. గోల్డ్ రూ. 5 వేలకుపైగా.. వెండి ఏకంగా రూ. 20వేలు..
బ్యాటరీ మరియు కెమెరా వివరాలు
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ M17e 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ఆటోఫోకస్ సామర్థ్యాలు, ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ షూటర్ మెయిన్ ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి తోడుగా ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.
శాంసంగ్ ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, GPS, GLONASS, BeiDou, Galileo, QZSS ఉన్నాయి. ఈ ఫోన్ కొలతలు 167.4×77.4×8.2mm, బరువు 199గ్రాములు ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ M17e 5జీలో 6,000mAh బ్యాటరీ ఉంది. 36 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ ఉంది.
Samsung Galaxy M17e 5G అనేది తక్కువ ధరలో మంచి ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు ఒక మంచి ఎంపిక. దీనిలోని 50MP కెమెరా మరియు 6,000mAh బ్యాటరీ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.


