
📌 Key Points
- ‘భీమ్లా నాయక్’, ‘విరూపాక్ష’, ‘సార్’, ‘బింబిసారా’ చిత్రాలతో సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.
- ‘చింతకాయల రవి’ దర్శకుడు యోగి చాలా కాలం తర్వాత తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘బ్లాక్ గోల్డ్’.
- నూతన సంవత్సర సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో గాయంతో, రివాల్వర్‌తో సంయుక్త మీనన్ పవర్ ఫుల్ లుక్‌లో ఉంది.
- హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా 2026 వేసవిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సంయుక్త మీనన్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘బ్లాక్ గోల్డ్’ నుండి న్యూ ఇయర్ సందర్భంగా ఓ అదిరిపోయే పోస్టర్ విడుదలయ్యింది. పవర్ ఫుల్ లుక్‌లో సంయుక్త ఆకట్టుకోగా, యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 వేసవిలో విడుదల కానుంది.
సంయుక్త మీనన్ కెరీర్: హిట్ చిత్రాలతో ప్రస్థానం
‘భీమ్లా నాయక్’(Bhimla Nayak) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘విరూపాక్ష’(Virupaksha), ‘సార్’(Sir), ‘బింబిసారా;(Bimbisara) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రజెంట్ తాను నటిస్తున్న మూవీస్‌లో ‘బ్లాక్ గోల్డ్’(Black Gold) ఒకటి. దీనికి ‘చింతకాయల రవి’ చిత్రంతో దర్శకునిగా పరిచయమైన యోగి(Yogi) చాలా విరామం తర్వాత ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. అయితే నేడు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘బ్లాక్ గోల్డ్’ విశేషాలు: లేడీ ఓరియెంటెడ్ సినిమా
‘బ్లాక్ గోల్డ్ బృందం తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. బలం, స్థితిస్థాపకత మరియు ధైర్యం యొక్క శక్తివంతమైన కథ ఈ వేసవి 2026 థియేటర్లలో వేచి ఉంది’ అంటూ ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక పోస్టర్‌లో సంయుక్త మీనన్ మొహం మీద గాయంతో చేతిలో రివాల్వర్ పట్టుకొని సీరియస్‌గా చూస్తుంది. ఇక ఈ పోస్టర్ మీద బ్లడీ హ్యాపీ న్యూయర్ అని రెడ్ కలర్‌తో రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోస్టర్ హైలైట్స్: పవర్ ఫుల్ లుక్‌లో సంయుక్త
A post shared by Hasya Movies (@hasyamovies)
ప్రస్తుతం సంయుక్త పవర్ ఫుల్ లుక్‌తో కూడిన ‘బ్లాక్ గోల్డ్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బలం, స్థితిస్థాపకత, ధైర్యంతో కూడిన కథనంతో ఈ సినిమా వేసవి 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


