
📌 Key Points
- సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: చీరలో బాపు బొమ్మలా మెరుపులు!
- శర్వానంద్ సరసన ‘నారి నారి నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి సందడి చేసిన సంయుక్త.
- బాలకృష్ణతో ‘అఖండ-2’లో నటించిన ఈ యంగ్ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్.
- ఆరెంజ్ శారీలో సంయుక్త ట్రెడిషనల్ లుక్: నెటిజన్ల నుండి ప్రశంసల వర్షం!
‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన ట్రెడిషనల్ లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చీరలో ఆమె అందం అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
సంయుక్త మీనన్ ట్రెడిషనల్ లుక్ వైరల్
‘భీమ్లా నాయక్’(Beemla Nayak) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి మనందరికీ సుపరిచితమే. ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ చిన్నది తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక రీసెంట్‌గా బాలకృష్ణ(Balakrishna) సరసన ‘అఖండ-2’(Akhanda-2) మూవీలో యాక్ట్ చేసిన ఈ చిన్నది తాజాగా యంగ్ హీరో శర్వానంద్(Sharwanand)తో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) మూవీతో మన ముందుకు వచ్చింది.
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మరోపక్క సోషల్ మీడియా(Social Media)లో కూడా బాగా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సంయుక్త తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్లీవ్ లెస్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ శారీలో చాలా ట్రెడిషనల్‌గా రెడీ అయింది.
నెటిజన్ల కామెంట్స్: కత్తిలా ఉన్నావంటూ ప్రశంసలు
మల్లెపూలు, బుట్టాలు, గాజులు, బొట్టు పెట్టుకొని బాపు బొమ్మలా కనిపించింది. ఇక చేతిలో కలువ పూలు పట్టుకున్న ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కత్తిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.
‘అఖండ-2’ హీరోయిన్ సోషల్ మీడియా సెన్సేషన్
A post shared by Samyuktha (@iamsamyuktha_)
సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఆమె అందం, ట్రెడిషనల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


