|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె నన్ను వదిలివెళ్లిపోయిందంటూ భావోద్వేగ పోస్ట్

Published: 25-06-2025, 2:46 AM
హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె నన్ను వదిలివెళ్లిపోయిందంటూ భావోద్వేగ పోస్ట్

ప్రముఖ బాలీవుడ్ మరియు తెలుగు నటి సనా ఖాన్ తల్లి కన్నుమూశారు. ఈ విషాదకరమైన సమాచారాన్ని సనా ఖాన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆమె తల్లి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Key Points

1

బాలీవుడ్ నటి సనా ఖాన్ తల్లి మృతి.

2

సనా ఖాన్ సోషల్ మీడియాలో తన తల్లి మరణం గురించి వెల్లడించింది.

4

సినీ ప్రముఖులు, అభిమానులు సనాకు సంతాపం తెలియజేస్తున్నారు.

సనా ఖాన్ తల్లి మృతి

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సనా ఖాన్(Sana Khan) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతి చెందింది. ఇక ఈ విషయాన్ని సనా ఖాన్ ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘‘నా ప్రియమైన తల్లి శ్రీమతి సయీదా (Sayeda)అనారోగ్య సమస్యతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు వెళ్లారు. ఇషా తర్వాత ఓషివారా ఖబ్రస్థాన్‌లో నమాజ్-ఎ-జనాభా నిర్వహిస్తారు. నా తల్లి కోసం మీరు చేసే ప్రార్థపలు సహాయపడతాయి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కొందరు సనాకు ధైర్యంగా ఉండమని చెబుతున్నారు.

కాగా, సనాఖాన్ విషయానికొస్తే.. ఈ అమ్మడు ‘బొంబై టు గోవా’ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్(Salman Khan) ‘జైహో’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో కళ్యాణ్ రామ్ ‘కత్తి’ (kathi)మూవీతో ఎంట్రీ ఇచ్చి గగనం, మిస్టర్ నూకయ్య, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన సనాఖాన్ బిగ్‌బాస్ షోలోనూ కనిపించింది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే ముస్లిం గురు ముఫ్తీ అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు పుట్టడంతో సినిమాలకు దూరంగా ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. నిత్యం తన భర్త, కొడుకుతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

సోషల్ మీడియా పోస్ట్

సినీ ప్రయాణం

సనా ఖాన్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట కాలంలో ఆమెకు ధైర్యం చేకూరాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.