|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అలా చేయడమంటే డబ్బులతో పోరాటం.. ప్రేమ ఇవ్వరా అనే గుడ్డి కోరిక.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

Published: 12-05-2025, 8:48 AM
అలా చేయడమంటే డబ్బులతో పోరాటం.. ప్రేమ ఇవ్వరా అనే గుడ్డి కోరిక.. హీరో సందీప్ కిషన్ కామెంట్స్

నవీన్ చంద్ర నటించిన లెవెన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ పాల్గొని, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైలింగువల్ సినిమా నిర్మాణం గురించి ఆయన అభిప్రాయాలను ఈ కథనం వివరిస్తుంది.

Key Points

1

లెవెన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2

తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాల నిర్మాణంలోని సవాళ్లను సందీప్ కిషన్ వివరించారు.

4

నవీన్ చంద్ర నటనకు, లెవెన్ సినిమా విజయానికి సందీప్ కిషన్ శుభాకాంక్షలు తెలిపారు.

లెవెన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్

నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ బైలింగువల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ లెవెన్ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్ విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్. మే 16న లెవెన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన లెవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్‌గా హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సీజ్ ఫైర్ సమాచారం వచ్చిన తర్వాత ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మన కోసం ప్రాణం పెట్టి పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి బిగ్ సెల్యూట్. ఒక నటుడిగా సైనికులకి ఎంత సహాయం చేయగలనో అది చేస్తాను. మీరు కూడా మీ వంతు కుదిరిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. వారు మన సహాయం కోసం ఆధారపడలేదు. వారి త్యాగానికి ఇది మన బాధ్యత” అని అన్నాడు.

సందీప్ కిషన్ వ్యాఖ్యలు

“సినిమా విషయానికొస్తే.. ఈ వేడుకకు వచ్చే ముందు ఇది నవీన్ సినిమా. టైటిల్ లెవెన్ ఇదొక్కటి మాత్రమే నాకు తెలుసు. తనకి మంచి జరగాలని సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. నవీన్ నాకంటే సీనియర్. తన ప్రతి సినిమా తన టాలెంట్‌తోనే తెచ్చుకున్నాడు. ఆడిషన్స్ ఇచ్చే తెచ్చుకున్నాడు. తన ప్రతిభను గుర్తించే అవకాశం వచ్చింది. అదృష్టాన్ని కాకుండా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న యాక్టర్ నవీన్ ” అని సందీప్ కిషన్ తెలిపాడు.

“తన ప్రతి సినిమాలో ద బెస్ట్ పర్ఫామెన్స్ ఉంటుంది. నవీన్‌కి ఇది గుడ్ డే. తెలుగు తమిళ్ బైలింగువల్ చేయడం అంటే డబ్బులతో పోరాటం. ప్రతి సీన్ 2 సార్లు చేయాలి. రెండు చోట్ల ప్రమోషన్ చేయాలి. ఇది తెలుగు సినిమానా తమిళ్ సినిమానా అని ప్రతి ఒక్కరికి వివరణ ఇచ్చుకోవాలి. ఇవన్నీ దాటి కూడా చేయడానికి కారణం అక్కడున్న ఆడియన్స్ పట్ల, భాష పట్ల ప్రేమ. ఆడియన్స్ మన కష్టానికి తగిన ప్రేమ ఇవ్వరా అనే ఒక గుడ్డి కోరిక” అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

బైలింగువల్ సినిమా సవాళ్లు

“ఈ సినిమా నవీన్‌కి చాలా మంచి సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నాను. సినిమా మీద విపరీతమైన పాషన్ ఉంటేనే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఈ సినిమా ట్రైలర్ చూశాను ట్రైలర్‌లో క్రాఫ్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ లోకేష్ చాలా అద్భుతంగా సినిమాని తీసాడు అనిపించింది. ఇది కథని కంటెంట్‌ని నమ్ముకుని చేసిన సినిమా. నటీనటులు టెక్నీషియన్స్ ద బెస్ట్ ఇచ్చారని అనిపిస్తోంది” అని సందీప్ కిషన్ వెల్లడించాడు.

“ఇమాన్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ తెలుగు సినిమా నాతోనే చేశారు. ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మే 16న ఈ సినిమా రాబోతుంది. అందరూ థియేటర్స్‌లో చూడండి. నవీన్‌కి ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను” అని హీరో సందీప్ కిషన్ తన స్పీచ్ ముగించాడు.

చివరగా, సందీప్ కిషన్ లెవెన్ సినిమాకు శుభాకాంక్షలు తెలిపి, బైలింగువల్ సినిమాల నిర్మాణంలోని కష్టాలను, ప్రేక్షకుల ప్రేమ కోసం గల కోరికను వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.