
నిహాల్, సూర్య హీరోలుగా నటించిన చైనా పీస్ సినిమా టీజర్ శనివారం విడుదలైంది. ఈ టీజర్ లాంచ్ కు హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరై, సినిమా, రీల్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Key Points
సందీప్ కిషన్ "చైనా పీస్" టీజర్ లాంచ్ లో పాల్గొన్నారు.
రీల్స్ ద్వారా కూడా ఫేమస్ అవ్వొచ్చని సందీప్ కిషన్ అభిప్రాయం.
నిహాల్, సూర్య హీరోలుగా నటించిన "చైనా పీస్" సినిమా టీజర్ విడుదల.
"చైనా పీస్" ఒక యూనిక్ స్పై యాక్షన్ కామెడీ డ్రామా.
చైనా పీస్ టీజర్ లాంచ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన సినిమా చైనా పీస్. అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూనిక్ స్పై యాక్షన్ కామెడీ డ్రామాగా రూపొందించారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.
తాజాగా శనివారం (జూలై 26) చైనా పీస్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో సందీప్ కిషన్ హాజరై చైనా పీస్ టీజర్ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా నిర్వహించిన చైనా పీస్ టీజర్ లాంచ్‌లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సందీప్ కిషన్ కామెంట్స్
పీపుల్ స్టార్ సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈవెంట్‌తో మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరితో కలిసి ఈ టీజర్‌ని సెలబ్రేట్ చేసుకోవడం వెరీ హ్యాపీ” అని అన్నాడు.
“నేను ఈవెంట్‌కి రావడానికి కారణం నిహాల్. తను టీజర్ పంపించాడు. నాకు చాలా నచ్చింది. తను సినిమాని ప్రేక్షకుల వద్దకు చేరవేయాలనే ఆరాటం నాకు చాలా నచ్చింది. తను ఈ వేడుకలో మాట్లాడిన మాటలు కూడా నాకు చాలా నచ్చాయి” అని సందీప్ కిషన్ తెలిపాడు.
సినిమా విశేషాలు
“ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి. మన ఆలోచనల్ని దేశం మొత్తం చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. ఫేమస్ అవ్వాలనుకుంటే రీల్స్ చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు. ఇది ఒక స్పై ఫిల్మే కాదు స్పై కామెడీ, సీరియస్ కామెడీ కూడా ఉంది” అని సందీప్ కిషన్ చెప్పాడు.
“దర్శకుడు ఈ కథని నమ్మాడు. నమ్మింది చిత్రీకరించాడు. నిహాల్, సూర్య వీళ్లందరిలోనూ ఒక నిజాయితీ ఉంది. తప్పకుండా ఆ నిజాయితీని మనమందరం అప్రిషియేట్ చేయాలి. ఒక కొత్త ఫిలిం మేకర్స్ కొత్తగా నటించినప్పుడు ఆ సినిమాకు వెళ్లి వాళ్ల ఆలోచనని చూడడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా” అని సందీప్ కిషన్ పేర్కొన్నాడు.
చివరగా, సందీప్ కిషన్ చైనా పీస్ సినిమాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రీల్స్ ద్వారా కూడా ఫేమ్ పొందవచ్చని ఆయన సూచించడం విశేషం.


