|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నీలాంటి ఫ్రెండ్ ఉంటే పెళ్లిళ్లు జరగవు, రెజీనాపై సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్

Published: 10-08-2025, 10:40 AM
నీలాంటి ఫ్రెండ్ ఉంటే పెళ్లిళ్లు జరగవు, రెజీనాపై సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ నటులు సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా మధ్య ఉన్న స్నేహం ప్రతి ఒక్కరికీ తెలుసు. తాజాగా ఢీ షోలో జరిగిన ఒక సంఘటన వీరిద్దరి స్నేహాన్ని మరోసారి నిరూపించింది. రెజీనాకు ఫోన్ చేసిన సందీప్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Key Points

1

రెజీనా, సందీప్ కిషన్ మధ్య బలమైన స్నేహం

2

ఢీ షోలో రెజీనా సందీప్ కిషన్ కు కాల్ చేసింది

4

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది

రెజీనా, సందీప్ స్నేహం

టాలీవుడ్‌ హీరో హీరోయిన్లలో మంచి ఫ్రెండ్షిప్ మెయింటేన్ చేసే స్టార్స్ గా సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరిద్దరూ గతంలో కలిసి రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, మా నగరం, నక్షత్రం వంటి నాలుగు సినిమాల్లో నటించారు. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం కూడా జరిగింది. ఎన్ని రకాలుగా ప్రచారం జరిగినా, ఎవరు ఏమనుకున్నా, సోషల్ మీడియాలో ఎన్ని ప్రచారాలు జరిగినా.. ఈ ఇద్దరు స్టార్స్ తమ బంధాన్ని కేవలం బెస్ట్ ఫ్రెండ్‌షిప్ అని స్పష్టంగా చెప్పారు. మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు.

ఇక తాజాగా వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉందని చూపించే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్ర‌స్తుతం రెజీనా కసాండ్రా ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ లో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరగిన ఫ్రెండ్‌షిప్ డే థీమ్‌ లో స్టార్ సెలబ్రిటీలు సందడి చేశారు. డాన్సర్స్ అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొట్టారు. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా రెజీనాను ఇండస్ట్రీలో తన బెస్ట్ ప్రెండ్ ఎవరో కాల్ చేయమని టాస్క్ ఇచ్చారు. అప్పుడు వెంటనే రెజీనా తన బెస్ట్ ఫ్రెండ్ సందీప్ కిషన్‌కు  కాల్ చేసింది.

ఢీ షోలో వైరల్ కామెంట్స్

ఈ సందర్భంగా, రెజీనా మాట్లాడుతూ – “బెస్ట్ ఫ్రెండ్‌కి కాల్ చేయమంటే నీకే కాల్ చేశాను,” అని చెప్పారు. దీనిపై సందీప్ సరదాగా స్పందిస్తూ,

“అప్పుడప్పుడు అయినా ఇలాంటివి చేయడానికి నీకు ఛాన్స్ రావడం మంచిదే, నా లవ్ స్టోరీలు ఎంత బాధాకరంగా ఉంటాయో ఆ అమ్మాయికి తెలుసు అన్నారు. అంతే కాదు నీ లాంటి ఫ్రెండ్ ఉంటే అసలు పెళ్లి జరగదు,” అంటూ కామెంట్ చేశారు. దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు.

సోషల్ మీడియా ప్రతిచర్య

ఈ కామెంట్స్ స్టేజ్‌పై లైవ్‌లోనే రావడంతో ఈ ఎపిసోడ్ కు ఈ కామెంట్స్ ప్రత్యేకంగా మారాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు తన ప్రేమ కథలు అన్నీ రెజీనాకు తెలుసు అంటే, సందీప్ కు ఎన్ని ప్రేమ కథలు ఉన్నాయో అని కామెంట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈక్రమంలో ఆది కల్పించుకుని అన్నా మిమ్మల్ని టాలీవుడ్ సల్మాన్ ఖాన్ అంటున్నారు అంతా అని అన్నారు. నెటిజన్లు ఈ వీడియోను భారీగా షేర్ చేస్తూ వస్తున్నారు.

ఈ వీడియో ప్రోమో విడుదలైన తర్వాత, డీ షో రేటింగ్స్‌కు కూడా మంచి లిఫ్ట్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్‌లో ఉంది. చాలా కాలం తరువాత రెజీనా కూడా కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో అలజడి సృష్టించాయి. రెజీనా, సందీప్ ల మధ్య ఉన్న బలమైన స్నేహం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వైరల్ వీడియో ఢీ షోకు మంచి ప్రచారాన్ని తెచ్చిపెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.