|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆమె నాకు ఫ్యామిలీతో సమానం.. యంగ్ బ్యూటీపై సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 30-05-2025, 5:46 AM
ఆమె నాకు ఫ్యామిలీతో సమానం.. యంగ్ బ్యూటీపై సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ తన సన్నిహితురాలు రెజీనా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటి కొనుగోలులో ఆమె చేసిన సహాయం గురించి, వారి మధ్య ఉన్న బంధం గురించి ఆయన పంచుకున్న విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

సందీప్ కిషన్ మరియు రెజీనా మధ్య స్నేహం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

2

రెజీనా ఇంటి కొనుగోలులో సహాయం చేసిందని సందీప్ తెలిపారు.

4

వీరిద్దరి మధ్య ఉన్న బంధం నెట్టింట వైరల్‌గా మారింది.

సందీప్ కిషన్-రెజీనా స్నేహం

టాలీవుడ్‌ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) మనందరికీ సుపరిచితమే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్‌ని ఎంచుకుంటూ ప్రజెంట్ హీరోగా రాణిస్తున్నాడు. అయితే ‘ప్రస్థానం’ మూవీలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తర్వాత మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆశించిన హిట్లు దక్కకపోవడంతో కెరీర్‌లో కాస్త వెనకబడ్డాడు. మధ్య మధ్యన కొన్ని హిట్లు దక్కినప్పటికీ సక్సెస్ గ్రాఫ్ స్థిరంగా లేదు. ఇక రీసెంట్‌గా ‘మజాకా’ మూవీతో మనముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

రెజీనా ఇంటి కొనుగోలులో సహాయం

ఇదిలా ఉంటే.. సందీప్ కిషన్- రెజీనా కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆ టైంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి అది కాస్త ప్రేమగా మారిందని అప్పటినుంచి వాళ్లు డేటింగ్‌లో ఉన్నారని అప్పట్లో ఎన్నో పుకార్లు నెట్టింట షికార్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా సందీప్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ.. ‘నేను ఇల్లు కొనుక్కునేటప్పుడు అమౌంట్ తగ్గితే నేను అడగకుండానే రెజీనా వెంటనే రూ.5లక్షలు పంపించింది. ఆమె నాకు ఫ్యామిలీతో సమానం. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్.. మేము కొట్టుకున్నంతగా ఎవరూ కొట్టుకొని ఉండరు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

వైరల్‌గా మారిన కామెంట్స్

లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సందీప్ కిషన్ చేసిన వ్యాఖ్యలు రెజీనాతో తనకున్న అనుబంధాన్ని చాటుతున్నాయి. వారి స్నేహం, ఆమె చేసిన సహాయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.