|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sundeep Kishan : సందీప్ కిషన్ ఇంట్లో విషాదం.. గొప్ప ప్రేమకథ అంటూ సందీప్ ఎమోషనల్ పోస్ట్..

Published: 18-06-2025, 10:21 AM
Sundeep Kishan : సందీప్ కిషన్ ఇంట్లో విషాదం.. గొప్ప ప్రేమకథ అంటూ సందీప్ ఎమోషనల్ పోస్ట్..

ప్రముఖ నటుడు సందీప్ కిషన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి కన్నుమూశారు. సందీప్ తన తాత, నానమ్మల ప్రేమకథను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

Key Points

1

సందీప్ కిషన్ నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి కన్నుమూశారు.

2

1960లో ఇంటర్ రిలీజియన్ ప్రేమకథగా వారి వివాహం జరిగింది.

4

సందీప్ కిషన్ తన నానమ్మ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

సందీప్ కిషన్ నానమ్మ మరణం

Sundeep Kishan : హీరో సందీప్ కిషన్ ఇంట్లో విషాదం నెలకొంది. సందీప్ కిషన్ నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి మరణించారు. దీంతో సందీప్ కిషన్, అతని మేనమామ, స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కూడా ఆమె అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మేరకు సందీప్ కిషన్ తన తాత, నానమ్మ ఫోటోలను షేర్ చేస్తూ.. మా చివరి గ్రాండ్ పేరెంట్ మా నానమ్మను నిన్న కోల్పోయాను. మా తాత కృష్ణం నాయుడు ఒక షిప్ ఆర్కిటెక్ట్. మా నానమ్మ ఆగ్నెస్ వైజాగ్ లోని ఒక పాఠశాలలో ప్రధానోపాద్యాయురాలు. 1960 లో వీరిది ఇంటర్ రిలీజియన్ ప్రేమకథ. వీరి ప్రేమకథ ఒక సినిమా కథలా అనిపిస్తుంది. వీరు పెళ్లి చేసుకున్నాక మా తాతగారు జోసెఫ్ కృష్ణం నాయుడు, నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి అయ్యారు. నాకు తెలిసిన గొప్ప ప్రేమ కథ వీరిది అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

గొప్ప ప్రేమకథ

Also See : Akhil Sarthak – Rithu Chowdary : తిరుమలలో అఖిల్ సార్థక్ – రీతూ చౌదరి జంటగా.. ఫొటోలు వైరల్..

సందీప్ కిషన్ నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి వైజాగ్ దగ్గర జ్ఞానాపురంలో ఉంటున్నారు. గతంలో అనేక స్కూల్స్ లో టీచర్ గా, హెడ్ మాస్టర్ గా పనిచేసారు. ఎంతోమంది పేదపిల్లలకు ఆవిడ చదువు అందించారని, వారి అవసరాలు తీర్చారని అక్కడి వారు గొప్పగా చెప్తారు. వయోభారంతో పలు ఆరోగ్య సమస్యలతో ఆగ్నెస్ లక్ష్మి 88 ఏళ్ళ వయసులో మరణించారు. ఆమెని క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతిలో సెయింట్‌ పీటర్స్‌ కేథడ్రల్‌ చర్చి సెమెట్రీలో భూస్థాపన చేసారు.

ఎమోషనల్ పోస్ట్

సందీప్ కిషన్ తన నానమ్మ గురించి పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ సినీ ప్రేక్షకులను కదిలించింది. వారి ప్రేమకథ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.