|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మొన్న సందీప్ రెడ్డి వంగా, నేడు కిరణ్ అబ్బవరం- జిగ్రీస్‌కు ఇద్దరి సపోర్ట్- పాజిటివ్ లిరిక్స్‌తో తిరిగే భూమి సాంగ్ రిలీజ్

Published: 29-08-2025, 8:45 PM
మొన్న సందీప్ రెడ్డి వంగా, నేడు కిరణ్ అబ్బవరం- జిగ్రీస్‌కు ఇద్దరి సపోర్ట్- పాజిటివ్ లిరిక్స్‌తో తిరిగే భూమి సాంగ్ రిలీజ్

హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న జిగ్రీస్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా టీజర్ విడుదల చేశారు. తాజాగా కిరణ్ అబ్బవరం ఈ సినిమాలోని ‘తిరిగే భూమి’ పాటను విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

Key Points

1

సందీప్ రెడ్డి వంగా టీజర్ విడుదల చేశారు

2

కిరణ్ అబ్బవరం 'తిరిగే భూమి' పాటను విడుదల చేశారు

4

జిగ్రీస్ సినిమాపై పెరుగుతున్న ఆసక్తి

జిగ్రీస్ సినిమా విడుదలకు సన్నద్ధం

తెలుగులో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కామెడీ మూవీ జిగ్రీస్. ఈ సినిమాకు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి జిగ్రీస్ సినిమాను నిర్మిస్తున్నారు. జిగ్రీస్ మూవీలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల ఘనంగా జరిగిన ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా జిగ్రీస్ టీజర్ రిలీజ్ అయింది. జిగ్రీస్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో కేవలం 3 రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ దాటిన జిగ్రీస్ టీజర్ యువతలో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇక తాజాగా జిగ్రీస్ సినిమా నుంచి వచ్చిన మొదటి పాటను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశారు. “తిరిగే భూమి” అంటూ సాగే జిగ్రీస్ సాంగ్‌ను ఆగస్ట్ 29న కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశారు. ఈ పాటను రిలీజ్ చేసిన తర్వాత హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

తిరిగే భూమి పాట విడుదల

“ఈ తిరిగే భూమి పాట చాలా ఎనర్జీటిక్‌గా ఉంది. కమ్రాన్ సయ్యద్ గారు ఇచ్చిన ట్యూన్ చాలా ఫ్రెష్‌గా ఉంది. లిరిక్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. టీజర్ నేను ముందే చూశాను. చాలా బాగా నచ్చింది” అని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు.

“ప్రస్తుతం నేను కే ర్యాంప్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా కూడా షూటింగ్ స్పాట్‌కి పిలిపించి మరీ సమయం ఇచ్చి ఈ సినిమా గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు. నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే, అందుకే కొత్త వాళ్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. జిగ్రీస్ టీమ్ చాలా ప్యాషన్‌తో పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. నా బెస్ట్ విషెస్ టు జిగ్రీస్ టీమ్” అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.

ప్రముఖుల మద్దతుతో సినిమాపై ఆసక్తి పెరుగుదల

కాగా, జిగ్రీస్ మొదటి పాట తిరిగే భూమిని మ్యూజిక్ లేబుల్ టీ సిరీస్‌లో విడుదల చేశారు. జిగ్రీస్ టీజర్‌తో వచ్చిన బజ్‌కి తోడు ఈ పాట కూడా యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెడుతోంది. ఇదిలా ఉంటే, జిగ్రీస్ సినిమాను బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తోంది.

ఇకపోతే మొన్న సందీప్ రెడ్డి వంగా, నేడు కిరణ్ అబ్బవరం ఇద్దరు జిగ్రీస్ సినిమాకు సపోర్ట్ చేయడంతో మూవీపై అందరి దృష్టి పడుతోంది. కాగా, జిగ్రీస్ సినిమాకు ఈశ్వర్ ఆదిత్య సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. అలాగే, కమ్రాన్ సయ్యద్ సంగీతం అందించగా చాణక్య రెడ్డి తూర్పు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

సందీప్ రెడ్డి వంగా మరియు కిరణ్ అబ్బవరంల మద్దతుతో జిగ్రీస్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘తిరిగే భూమి’ పాట యొక్క పాజిటివ్ స్పందన సినిమా విజయానికి సూచనగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.