
📌 Key Points
- సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా ‘యానిమల్ పార్క్’ సీక్వెల్.
- 2027 జూన్ లేదా జూలైలో ‘యానిమల్ పార్క్’ షూటింగ్ ప్రారంభం కానుంది.
- సహోదరుల మధ్య పోరు నేపథ్యంలో ‘యానిమల్ పార్క్’ కథ ఉంటుందని వెల్లడి.
- 2028లో విడుదల కానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ హీరోగా, విలన్‌గా నటించనున్నారు.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ సినిమాకు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీతో పాటు స్టోరీని కూడా సందీప్ వెల్లడించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
యానిమల్ పార్క్ విడుదల ఎప్పుడంటే?
Sandeep Reddy Vanga:ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ డైరెక్టర్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy vanga). ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈయన.. ఆ తర్వాత హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమా చేసి తన ఖాతాలో వేసుకున్నారు. గత మూడేళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor)తో ‘యానిమల్’ సినిమా చేసి సంచలనం సృష్టించారు సందీప్ రెడ్డివంగా. ఇందులో రష్మిక మందన్న (Rashmika mandanna)హీరోయిన్గా నటించగా.. త్రిప్తి డిమ్రి (Tripti dimri)కీలకపాత్ర పోషించి.. ఈ ఒక్క సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా అప్పట్లో భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని దానికి ‘యానిమల్ పార్క్’ అంటూ మేకర్స్ టైటిల్ ని కూడా ప్రకటించారు.. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అసలు షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూడగా.. గత కొన్ని రోజుల క్రితం రణ్ బీర్ కపూర్ ఈ సినిమాపై ఊహించని అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని క్లారిటీ ఇచ్చి సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు.
సినిమా స్టోరీ లైన్ ఇదే!
అయితే ఇలాంటి సినిమాపై క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఊహించని కామెంట్లు చేయడంతో అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ ఆరోజే.. స్టోరీ ఇదే అంటూ చేసిన కామెంట్లకు మరింత ఎగ్జైట్ అవుతున్నారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి 13వ తేదీన ‘యానిమల్’ సినిమా జపాన్లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే రణ్ బీర్ కపూర్ , సందీప్ రెడ్డి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.. ప్రమోషన్స్ లో భాగంగా అక్కడి అభిమానులతో సందడి చేసిన వీరు.. అందులో భాగంగానే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జపాన్ అభిమానులతో సందీప్ రెడ్డివంగా మాట్లాడుతూ..” యానిమల్ పార్క్ ఉంటుంది 2027 జూన్ లేదా జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఒకే పోలికలతో ఉండే ఇద్దరు సోదరుల మధ్య జరిగే భీకర పోరునే ఈ సినిమాలో చూపించబోతున్నాము.రణబీర్ కపూర్ పోషించిన రణవిజయ్, అజీజ్ పాత్రల ఘర్షనే కథాంశం” అంటూ ఆయన అటు ఈ సినిమా కథాంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక 2028లో విడుదల చేస్తామని, ఇందులో హీరోగా, విలన్ గా రణ్ బీర్ నటించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే సినిమా విడుదల తేదీతో పాటు స్టోరీ కూడా లీక్ చేసి అంచనాలు పెంచారు సందీప్ రెడ్డి వంగ.
రణ్‌బీర్ కపూర్ డ్యూయల్ రోల్?
ప్రస్తుతం ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే అధికారిక ప్రకటన వెల్లడించారు. ఏది ఏమైనా స్పిరిట్ సినిమాతో సంచలనాలు సృష్టించి యానిమల్ పార్క్ తో రికార్డు బ్రేక్ చేయాలని చూస్తున్నారు.. యానిమల్ తో సంచలనం సృష్టించిన రన్బీర్ యానిమల్ పార్క్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
సందీప్ రెడ్డి వంగ ‘యానిమల్ పార్క్’ గురించి చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. రణ్‌బీర్ కపూర్ మరోసారి తన నటనతో మెప్పిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online