|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: సందీప్ రెడ్డి వంగా గురువు, నాగార్జున ‘కేడి’ డైరెక్టర్ కిరణ్ కుమార్ కన్నుమూత!

Published: 17-12-2025, 6:44 AM
షాకింగ్ న్యూస్: సందీప్ రెడ్డి వంగా గురువు, నాగార్జున 'కేడి' డైరెక్టర్ కిరణ్ కుమార్ కన్నుమూత!
  • ప్రముఖ దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) అనారోగ్యంతో కన్నుమూత.
  • నాగార్జున హీరోగా `కేడి` సినిమాను రూపొందించిన కేకే.
  • పాన్‌ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఈయనే గురువు.
  • ఇటీవల నటుడిగా రాణించి, `కేజేక్యూ` మూవీ చిత్రీకరణలో ఉండగానే మృతి.

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) కన్నుమూశారు. నాగార్జున `కేడి` సినిమాకు దర్శకత్వం వహించిన కేకే, పాన్‌ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు గురువు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ప్రస్థానం, చివరి సినిమాలు చూద్దాం.

నాగార్జున `కేడి` దర్శకుడిగా ప్రస్థానం

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కిరణ్‌ కుమార్‌(కేకే) కన్నుమూశారు. నాగార్జునతో `కేడి` మూవీని రూపొందించిన దర్శకుడు కిరణ్‌ అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా దర్శకుడిగా రాణిస్తున్న సందీప్‌ రెడ్డి వంగా.. దర్శకుడు కిరణ్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయడం విశేషం. ఒక పాన్‌ ఇండియా దర్శకుడిగా ట్రైన్‌ చేసిన ఘనత కిరణ్‌ కుమార్‌కి దక్కుతుంది.

దర్శకుడు కిరణ్‌ కుమార్‌.. మణిరత్నం వద్ద పలు సినిమాలు అసిస్టెంట్‌గా పనిచేశాడు. దీంతో అప్పట్నుంచే కిరణ్‌లోని ప్రతిభని గమనించిన హీరో నాగార్జున `కేడి` చిత్రంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఇందులో నాగార్జునని చాలా స్టయిలీష్‌గా ఆవిష్కరించారు. అయితే సినిమా బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఆడియెన్స్ ని మెప్పించలేకపోయింది. దీంతో ఆ తర్వాత సినిమా ఆఫర్లు రాలేదు.

సందీప్ రెడ్డి వంగాకి గురువుగా కేకే

ఇటీవల చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ `కేజేక్యూ`(కింగ్‌ జాకీ క్వీన్‌) పేరుతో ఓ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీలో ప్రముఖ యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల హీరోగా నటించగా, దీక్షిత్‌ శెట్టి మరో హీరోగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇంతలోనే దర్శకుడు కిరణ్‌ కన్నుమూయడం అత్యంత విచారకరం.

నటుడిగా, కొత్త సినిమాతో కేకే మళ్ళీ

కిరణ్‌ నటుడిగానూ మెప్పించారు. ఇటీవల విజయ్‌ ఆంటోని హీరోగా రూపొందిన `భద్రకాళి` మూవీలో కీలక పాత్రలో నటించాడు. ఒక స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. సెకండాఫ్‌లో తన సత్తాని చాటారు. ఆయన పాత్ర అదిరిపోయేలా ఉంటుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో దర్శకుడిగానే కాదు, నటుడిగా మెప్పించగలను అని నిరూపించారు కేకే. ఆయనకు నటుడిగా ఆఫర్లు చాలానే వచ్చేవి. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. కేకే మృతి పట్ల చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది. సందీప్‌ రెడ్డి వంగా తీవ్ర విచారానికి గురవుతున్నారు.

దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన కిరణ్ కుమార్ మరణం చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్. ఆయన అకాల మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.