|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆకట్టుకునేలా ‘సందిగ్ధం’.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సీన్స్‌తో మెప్పిస్తున్న టీజర్

Published: 31-10-2025, 3:36 PM
ఆకట్టుకునేలా ‘సందిగ్ధం’.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సీన్స్‌తో మెప్పిస్తున్న టీజర్

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ‘సందిగ్ధం’ చిత్రం టీజర్ విడుదలైంది. నటుడు అశోక్ కుమార్ ఈ టీజర్‌ను ఆవిష్కరించారు. నిహాల్, ప్రియా దేశ్ పాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కథ చాలా ప్రత్యేకంగా ఉంటుందని దర్శకుడు పార్ద సారథి తెలిపారు.

Key Points

1

‘సందిగ్ధం’ చిత్రం సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో రూపొందింది.

2

నటుడు, నిర్మాత అశోక్ కుమార్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

4

దర్శకుడు పార్ద సారథి కొమ్మోజు కథ చాలా ప్రత్యేకమైనదని వివరించారు.

‘సందిగ్ధం’ టీజర్ విడుదల

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న చిత్రం ‘సందిగ్ధం’. సంధ్య తిరువీధుల నిర్మాతగా పార్ద సారథి కొమ్మోజు తెరకెక్కించిన అ మూవీలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ‘సందిగ్ధం’ టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ రిలీజ్ చేశారు. ఇక టీజర్ గమనిస్తే.. ఓ ఊరు, అందులో జరిగే వింత ఘటనలు, ప్రేమ కథ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కి సరిపడగా ఉండటంతో.. ప్రజెంట్ ఇది ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. దర్శకుడు పార్ద సారథి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ విషయంలో ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి కథ ఇంత వరకు రాలేదని చెప్పొచ్చు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటే ఈ చిత్రాన్ని మీరందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్లను మీడియా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్

దర్శకుడి మాటలు: ప్రత్యేకమైన కథ

కొత్తవాళ్లను ప్రోత్సహించాలని కోరుతూ, తమ ‘సందిగ్ధం’ చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు పార్ద సారథి అన్నారు. ఇలాంటి కథ ఇంతవరకు రాలేదని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.