|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ 9 తెలుగులో హాట్ టాపిక్ గా సంజన గల్రానీ.. ఆమె చెల్లి హీరోయిన్ అని తెలుసా? మరిది ఇప్పుడు టాప్ యాక్టర్

Published: 28-09-2025, 12:14 PM
బిగ్ బాస్ 9 తెలుగులో హాట్ టాపిక్ గా సంజన గల్రానీ.. ఆమె చెల్లి హీరోయిన్ అని తెలుసా? మరిది ఇప్పుడు టాప్ యాక్టర్

బిగ్ బాస్ 9 తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి హాట్ టాపిక్ గా మారింది సంజన గల్రానీ. బుజ్జిగాడు సినిమాతో పరిచయమైన ఆమె చెల్లి నిక్కీ గల్రానీ కూడా హీరోయిన్ కాగా, ఆమె భర్త, సంజన మరిది ఆది పినిశెట్టి టాప్ యాక్టర్ అని మీకు తెలుసా?

Key Points

1

బిగ్ బాస్ 9 తెలుగులో సంజన గల్రానీ హాట్ టాపిక్ గా మారింది.

2

తెలుగులో బుజ్జిగాడు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు చేసింది సంజన.

4

నిక్కీ భర్త, సంజన మరిది ఆది పినిశెట్టి టాప్ టాలీవుడ్ నటుడు.

బిగ్ బాస్ లో సంజన గల్రానీ కెరీర్

బిగ్ బాస్ 9 తెలుగును మరిం ఇంట్రెస్టింగ్ మార్చేందుకు ఓ కామనర్ ను వైల్డ్ కార్డు ఎంట్రీగా పంపించారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సంజన గల్రానీతో డ్రామా ప్లే చేశారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ తో సంజనను సీక్రెట్ రూమ్ లో ఉంచి, ఆ తర్వాత స్టేజీ మీదకు పిలిచి, హౌస్ మేట్స్ త్యాగాలతో తిరిగి ఇంట్లోకే పంపే స్కెచ్ వేశారు. ఇప్పుడు సంజన గల్రానీ పేరు వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 9 తెలుగులో సంజన గల్రానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారింది. ఈ బుజ్జిగాడు మూవీ హీరోయిన్ తన పాయింట్ ను గట్టిగా చెప్తూ, ఆటను రసవత్తరంగా మారుస్తోంది. తెలుగులో సోగ్గాడు, బుజ్జిగాడు, సమర్థుడు, పోలీస్ పోలీస్, దుశ్వాసన, ముగ్గురు, యమహో యమ, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్, 2 కంట్రీస్ తదితర సినిమాలు చేసింది సంజన.

సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ సినీ ప్రస్థానం

బిగ్ బాస్ 9 తెలుగు తో మరింత పాపులర్ అవుతున్న సంజన గల్రానీ చెల్లి కూడా హీరోయినే. ఆమెనే నిక్కీ గల్రానీ. తెలుగులో మలుపు, క్రిష్ణాష్టమి, శివుడు సినిమాలు చేసింది నిక్కీ. తమిళం, కన్నడ, మలయాళంలో ఈ నటి చాలా బిజీ. క్యూట్ లుక్స్ తో పాటు మంచి యాక్టింగ్ తో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది నిక్కీ గల్రానీ.

సంజన సిస్టర్ నిక్కీ గల్రానీ భర్త గురించి దాదాపుగా తెలుగు మూవీ లవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. అతనే.. ఆది పినిశెట్టి. అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన సరైనోడు మూవీలో విలన్ గా ఆది పినిశెట్టి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందే తెలుగులో ఒక ‘వి’చిత్రం, గుండెల్లో గోదారి, మలుపు సినిమాల్లో హీరోగా చేశాడు ఆది. మలుపు షూటింగ్ సమయంలోనే నిక్కీ గల్రానీతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత వీళ్లు పెళ్లి చేసుకున్నారు.

సంజన మరిది ఆది పినిశెట్టి స్టార్ స్టేటస్

అజ్ణాతవాసి, రంగస్థలం, యు టర్న్, రణరంగం, గుడ్ లక్ సఖి, క్లాప్, ది వారియర్, శివుడు లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించాడు ఆది. ఇప్పుడు బాలయ్య బాబు అఖండ 2లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు ఆది పినిశెట్టి.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ హోరాహోరీగా సాగుతోంది. మూడో వీక్ ఎండింగ్ కు వచ్చింది. ఈ వారం కామనర్ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. మరోవైపు సంజన తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టింది.

బిగ్ బాస్ 9 తెలుగులో సంజన గల్రానీ ఆట తీరుతో పాటు, ఆమె కుటుంబ సినీ నేపథ్యం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఆమె కుటుంబ సభ్యులెవరో ఇప్పుడు అందరికీ స్పష్టంగా తెలిసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.