|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డ్రెస్సులపై సంజనా షాకింగ్ కామెంట్స్! అనసూయకు స్ట్రాంగ్ కౌంటర్.. శివాజీకి మాస్ సపోర్ట్!

Published: 07-01-2026, 12:15 AM
డ్రెస్సులపై సంజనా షాకింగ్ కామెంట్స్! అనసూయకు స్ట్రాంగ్ కౌంటర్.. శివాజీకి మాస్ సపోర్ట్!
  • బిగ్‌బాస్ సంజనా గల్రానీ సంచలన వ్యాఖ్యలు వైరల్.
  • పాత గ్లామర్ డ్రెస్సులపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సంజనా.
  • శివాజీ కామెంట్స్‌కు పూర్తి మద్దతు పలికిన బిగ్‌బాస్ బ్యూటీ.
  • అనసూయను టార్గెట్ చేస్తూ సంజనా ఇచ్చిన షాకింగ్ రిప్లై!

బిగ్‌బాస్ బ్యూటీ సంజనా గల్రానీ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. డ్రెస్సుల వివాదంపై ఆమె స్పందన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శివాజీకి మద్దతు తెలుపుతూ అనసూయకు పరోక్షంగా ఇచ్చిన కౌంటర్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆమె చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

గతంలో గ్లామర్ డ్రెస్సులపై సంజనా పశ్చాత్తాపం!

సంజనా గల్రానీ అంతకు ముందు హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్ కి బాగా పరిచయం. ప్రభాస్‌ హీరోగా వచ్చిన `బుజ్జిగాడు` మూవీలో సెకండ్‌ లీడ్‌గా చేసి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. మ్యారేజ్‌ చేసుకుని టాలీవుడ్‌కి దూరమయ్యింది. ఇటీవల `బిగ్‌ బాస్‌ తెలుగు 9` షో ద్వారా మళ్లీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ షో ఆమెకి మంచి క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని తెచ్చింది. ఊహించని పాపులారిటీని తెచ్చింది. బిగ్‌ బాస్‌ షోలో ఇమ్మాన్యుయెల్‌కి అమ్మగా వ్యవహరిస్తూ, ఇప్పుడు రియల్ లైఫ్‌ లోనూ చాలా మందికి అమ్మగా మారిపోయింది.

పాలుతాగే పిల్లాడిని కూడా వదిలేసి బిగ్‌ బాస్‌ షోకి వచ్చిన సంజనా తాను అనుకున్నది సాధించింది. తన ఇమేజ్‌ని మార్చేసుకుంది. తనపై పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిని డామినేట్‌ చేసేలా తన ఇమేజ్‌ క్రియేట్‌ అయ్యిందని చెప్పొచ్చు. చాలా ఇన్నోసెంట్‌ అనే ముద్ర పడింది. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా టాప్‌ 5 వరకు వెళ్లింది. 5వ స్థానంలో ఎలిమినేట్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత ఇటీవల ఆమె పలు మీడియా సంస్థలతో ముచ్చటించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కొడుకు, ఫ్యామిలీ గురించి స్పందించింది. అందులో భాగంగానే హీరోయిన్ల డ్రెస్‌ల గురించి రియాక్ట్ అయ్యింది.

శివాజీ వ్యాఖ్యలకు సంజనా మాస్ సపోర్ట్!

గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హీరోయిన్లు, మహిళలు వేసుకోవాల్సిన డ్రెస్‌ గురించి నటుడు శివాజీ చేసిన కామంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై చాలా మంది హీరోయిన్లు రియాక్ట్ అయ్యారు. అందులో యాంకర్‌, నటి అనసూయ రియాక్ట్ కావడం బాగా వైరల్‌ అయ్యింది. ఆమె చుట్టూ ఈ వివాదం నడిచింది. ఇంకా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా బిగ్‌ బాస్‌ తో విశేషమైన పాపులరిటీని సొంతం చేసుకున్న సంజనా గల్రానీ స్పందించింది. గ్లామర్‌ షోని ఆమె తప్పుపట్టింది. కంఫర్ట్ డ్రెస్‌ వేసుకోవాలని, అతిగా గ్లామర్‌ చేస్తే అది మీకే ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది.

శివాజీ వ్యాఖ్యలను సమర్ధించిన సంజనా.. `ఒకప్పుడు తాను 18, 19ఏజ్‌లో చాలా వరకు గ్లామర్‌ రోల్స్ చేశాను, శ్రుతి మించిన ఎక్స్ పోజ్‌ చేశాను, అవి ఇప్పుడు చూసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. పెళ్లై, పిల్లలు పుట్టాక అలాంటి ఫోటోలు చూస్తే ఇలా ఎందుకు చేశానని బాధపడుతున్నాను. చాలా రిగ్రెట్‌ ఫీలవుతున్నాను. అప్పుడు ఎలా ఉండాలనేది తెలియదు, వెనకాల ఎవరూ లేరు, చెప్పేవారు లేరు, ఫ్యామిలీ కూడా చెప్పలేదు, దీంతో ఇండస్ట్రీలో సర్వైవ్‌ కోసం పొట్టిదుస్తులు వేసుకున్నాను. ఆయా ఫోటోలను చూస్తే ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే తాను కొన్ని వెబ్‌ సైట్లకి ఫోన్‌ చేసి ఆయా ఫోటోలను తీయిస్తున్నాను`అని చెప్పింది సంజనా.

అనసూయకు బిగ్‌బాస్ సంజనా షాకింగ్ కౌంటర్!

`కొత్తగా వచ్చేవారికి ఆమె సలహాలిస్తూ, మీకు ఏ డ్రెస్‌ కంఫర్ట్ గా ఉంటే వాటిని వేసుకోండి, జీన్స్, కుర్తా, గాగ్రా, శారీ, హాఫ్‌ శారీఇలా ఏది కంఫర్ట్ గా ఉంటే వాటిని ధరించండి, అంతేకాని ఓవర్‌ ఎక్స్ పోజ్‌ చేయకండి, గ్లామర్‌ గా కనిపించడంలో తప్పులేదు, కానీ శ్రుతి మించిన గ్లామర్‌ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇలానే అనిపిస్తుంది. కానీ 35-40 ఇయర్స్ వచ్చాక, మీకు పెళ్లై, పిల్లలు పుట్టాక, వారు మీ ఫోటోలను చూస్తే ఇబ్బంది పడతారు. తాను అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నాను` అని సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ విషయంలో ఎవరి మాట వినొద్దు అనే విషయాన్ని సంజనా వెల్లడించారు. పరోక్షంగా ఆమె అనసూయ లాంటి వారికి దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చింది. ప్రస్తుతం సంజనా కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

సంజనా గల్రానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరింత చర్చకు దారితీస్తున్నాయి. ఈ డ్రెస్ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.