|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్యాగ్‌ సర్దుకుని బయటకు వచ్చేసిన సంజనా.. నేరుగా సీక్రెట్‌ రూమ్‌కు!

Published: 26-09-2025, 9:04 AM
బ్యాగ్‌ సర్దుకుని బయటకు వచ్చేసిన సంజనా.. నేరుగా సీక్రెట్‌ రూమ్‌కు!

బిగ్‌బాస్ తెలుగులో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో సంజనాను బయటకు పంపగా, ఇది కేవలం డ్రామా అని తేలింది. సంజనా నేరుగా సీక్రెట్ రూమ్‌కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ట్విస్ట్ హౌస్‌లో, ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది.

Key Points

1

బిగ్‌బాస్ ఈవారం హౌస్‌మేట్స్‌కు రంగుల విత్తనాలతో కొత్త టాస్క్‌లను ఇచ్చాడు.

2

ఎరుపు విత్తనం అందుకున్నవారు ఒకర్ని ఎలిమినేట్ చేయాలనే టాస్క్‌లో పాల్గొన్నారు.

4

అయితే, ఇది కేవలం డ్రామా అని, సంజనాను సీక్రెట్ రూమ్‌కు పంపారని హౌస్‌మేట్స్, ప్రేక్షకులకు తెలిసింది.

బిగ్‌బాస్‌లో రంగుల విత్తనాల టాస్క్

బిగ్‌బాస్‌ ( Bigg Boss Telugu 9 ) ఈవారం మొదట్లో హౌస్‌మేట్స్‌కు కొన్ని ఫలాలిచ్చాడు. అందులో రంగురంగుల విత్తనాలున్నాయి. నీలిరంగు విత్తనం అందుకున్నవారు ఫ్యామిలీ నుంచి సర్‌ప్రైజ్‌లు అందుకున్నారు. నలుపు రంగు విత్తనం అందుకున్నవారు ఇమ్యూనిటీ కోసం పోటీపడ్డారు. ఇప్పుడిక ఎరుపు విత్తనం అందుకున్నవారికి పెద్ద టాస్కే ఇచ్చాడు బిగ్‌బాస్‌.

గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్‌ హౌస్‌లో ఒకర్ని బయటకు పంపాలన్నాడు. ఈ షోని దొంగతనాల షోగా మార్చడం నాకిష్టం లేదంటూ సంజనా ( Sanjana Galrani )ను ఎలిమినేట్‌ చేస్తే బాగుంటుందని సూచించాడు హరీశ్‌. భరణి, రాము, డిమాన్‌ పవన్‌, పవన్‌ కల్యాణ్‌ అందరూ కలిసి చర్చించుకున్నారు. మెజారిటీ సభ్యులు సంజనాకే ఓటేశారు. దీంతో సంజనాను వెంటనే మెయిన్‌ గేట్‌ నుంచి బయటకు వెళ్లమన్నాడు బిగ్‌బాస్‌. ఆమె అలా వెళ్లడంతోనే ఇమ్మాన్యుయేల్‌ గుక్కపెట్టి ఏడ్చాడు. కానీ, ఈ ఎలిమినేషన్‌ అనేది ఉట్టి డ్రామానే అని తెలుస్తోంది.

సంజనా ఎలిమినేషన్: అసలు డ్రామా ఏమిటి?

నామినేషన్స్‌లోనే లేదు ఆమెను అలా బయటకు పంపించినట్లే పంపించి మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు. అప్పటివరకు సీక్రెట్‌రూమ్‌లో ఉంచుతారు. అయితే ఈ విషయం హౌస్‌మేట్స్‌కు దాదాపు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే సంజనా అసలు నామినేషన్స్‌లోనే లేదు. అలాంటప్పుడు తనను నేరుగా ఎందుకు ఎలిమినేట్‌ చేస్తారు? ఇదంతా స్టంట్‌ అని అటు కంటెస్టెంట్లకు, ఇటు ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది.

సీక్రెట్ రూమ్‌లో సంజనా.. హౌస్‌మేట్స్ అనుమానాలు

మొత్తంగా, సంజనా ఎలిమినేషన్ బిగ్‌బాస్ చరిత్రలో మరో ఆసక్తికరమైన మలుపు. ఇది హౌస్‌మేట్స్‌ను, ప్రేక్షకులను ఎంతవరకు ఉత్కంఠకు గురిచేస్తుందో చూడాలి. సీక్రెట్ రూమ్ నుండి సంజనా మళ్లీ హౌస్‌లోకి తిరిగి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.