
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండస్ట్రీలోని సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Key Points
సంజయ్ దత్ బాలీవుడ్ ఇండస్ట్రీపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో నెంబర్లపై దృష్టి పెడుతున్నారని, సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ప్యాషన్ కనిపిస్తోందని అన్నారు.
సౌత్ ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు చేయాలనే ప్యాషన్‌ను బాలీవుడ్‌కు తీసుకెళ్తానని తెలిపారు.
సంజయ్ దత్ ప్రస్తుతం 'ది రాజా సాబ్' మరియు 'కేడీ-ది డెవిల్' సినిమాలలో నటిస్తున్నారు.
సంజయ్ దత్‌కు పరిచయం అక్కర్లేదు
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt)కు పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించడంతో పాటు ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక ఇటీవల సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంజయ్ దత్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా మారాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఒకే చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’మూవీతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం తెలుగులో ది రాజా సాబ్(The Raja Saab), సినిమాలో నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్ కన్నడలో ‘కేడీ-ది డెవిల్’(Kedi-The Devil) మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సంజయ్ దత్ బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘‘బాలీవుడ్ ఇండస్ట్రీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మిస్ అవుతుంది. ఇప్పుడు సినిమాలన్నీ కూడా నెంబర్స్ చుట్టూ తిరుగుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీ నుంచి నేను మంచి సినిమాలు చేయాలనే ప్యాషన్‌ను బాలీవుడ్‌కు తీసుకెళ్తాను. గతంలో బాలీవుడ్‌కు కూడా మంచి చిత్రాలుపై ఫ్యాషన్ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ కలెక్షన్లపై దృష్టి పెడుతున్నారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికీ ఆ ప్యాషన్ కనిపిస్తోంది. అందుకే నాకు ఇక్కడ పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సౌత్ ఇండియన్ సినిమాలు ముఖ్యంగా తెలుగు మూవీస్‌లో వచ్చిన మార్పులను అన్ని బాషల వారు ఆచరిస్తే బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
బాలీవుడ్ పై సంజయ్ దత్ కామెంట్స్
నెటిజన్ల స్పందన
సంజయ్ దత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలీవుడ్ మరియు సౌత్ ఇండస్ట్రీ మధ్య తేడాలను ఆయన హైలైట్ చేశారు. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.


