
📌 Key Points
- త్రిషాల దత్ బాలీవుడ్ ఎంట్రీపై షాకింగ్ నిజాలు బయటపెట్టింది, వైరల్ అవుతున్నాయి.
- తండ్రికి దగ్గరవ్వడానికే సినిమాల్లోకి రావాలని ఒకప్పుడు భావించింది.
- సంజయ్ దత్ సలహాతో నటనను విడిచి, సైకియాట్రిస్ట్‌గా మారింది.
- మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడమే తన లక్ష్యమని వెల్లడించింది.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కుమార్తె త్రిషాల దత్ గురించి ఇప్పుడు ఓ సంచలన వార్త ట్రెండింగ్ లో ఉంది. ఆమె సినీ రంగ ప్రవేశం గురించి, సైకియాట్రిస్ట్‌గా మారడం వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టింది. ఈ ఆసక్తికర విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
సినిమాల్లోకి రావాలనుకుంది ఎందుకు?
Sanjay Dutt Daughter Trishala Dutt Reveals Bollywood Debut: రాజా సాబ్ విలన్ సంజయ్ దత్ కుమార్తే త్రిషాల దత్ మొదట సినిమాల్లోకి రావాలనుకున్నట్లు, కాకపోతే నటిగా కాదని, తర్వాత సైకియాట్రిస్ట్‌గా మారడానికి గల అసలు కారణాలను తాజాగా చెప్పారు. దీంతో త్రిషాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Sanjay Dutt Daughter Trishala Dutt Reveals Bollywood Debut: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, ది రాజా సాబ్ విలన్ సంజయ్ దత్ గారాల పట్టి త్రిషాల దత్ తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా అమెరికాలో స్థిరపడిన త్రిషాల దత్ ఒకప్పుడు తాను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నానని.. కానీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణం ‘నటన’ కాదని సంచలన విషయాన్ని బయటపెట్టారు.
“నేను చిన్నప్పుడు బాలీవుడ్‌లోకి వెళ్లాలని ఆలోచించాను. అయితే అది నటన మీద ఉన్న మక్కువతో కాదు.. కేవలం నా తండ్రికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను” అని త్రిషాల దత్ పేర్కొన్నారు. తన తండ్రితో ఎక్కువ సమయం గడపడానికి సినిమా పరిశ్రమ ఒక్కటే మార్గమని ఆ వయసులో ఆమె భావించినట్లు తెలుస్తోంది.
“సినిమాల్లోకి రావడం నీ ఆలోచననేనా? నీ మనసు నిజంగా అటువైపే ఉందా?” అని సంజయ్ దత్ తనను అడిగినట్లు త్రిషాల గుర్తు చేసుకున్నారు. “నువ్వు ఫలానా వ్యక్తి కూతురివి అయినంత మాత్రాన ఇక్కడ ఆఫర్లు క్యూ కడతాయని, నువ్వు స్టార్ హీరోయిన్ అయిపోతావని అనుకోవద్దు. నీకు నచ్చిన రంగం ఏంటో ఆలోచించు” అని ఆయన హితబోధ చేశారట.
సంజయ్ దత్ కీలక సలహా!
“ప్రతి ఒక్కరికీ అంతర్గత పోరాటాలు ఉంటాయి. అందరూ అన్ని వేళలా ధైర్యంగా ఉండలేరు. ఒత్తిడిలో ఉన్నవారికి ‘నేను ఉన్నాను’ అని చెప్పడానికే నేను థెరపిస్ట్‌గా మారాను. బాలీవుడ్ కుటుంబం నుంచి వచ్చిన వారెవరూ మానసిక ఆరోగ్యం గురించి పెద్దగా మాట్లాడటం నేను చూడలేదు. సెలబ్రిటీ లకైనా, సామాన్యులకైనా జీవితం ఎప్పుడూ పూలబాటలా ఉండదు. అందరం మనుషులమే అన్న విషయాన్ని గుర్తు చేయడమే నా లక్ష్,” అని త్రిషాల చెప్పిన మాటలు ఆదర్శవంతంగా ఉన్నాయి.
త్రిషాల దత్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మల కుమార్తె. ఆమె ప్రస్తుతం అమెరికాలో మానసిక వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
2. త్రిషాల దత్ బాలీవుడ్‌లోకి ఎందుకు రాలేదు?
ఆమెకు నటనపై ఆసక్తి లేకపోవడం, తండ్రి సంజయ్ దత్ ఇచ్చిన సలహా మేరకు ఆమె తనకు ఇష్టమైన వైద్య వృత్తిని ఎంచుకున్నారు. కేవలం తండ్రికి దగ్గరవ్వడం కోసమే సినిమాల్లోకి రావాలని ఒకప్పుడు అనుకున్నట్లు ఆమె తెలిపారు.
సైకియాట్రిస్ట్‌గా మారిన వెనుక అసలు కథ!
3. సంజయ్ దత్ కుమార్తె ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?
త్రిషాల చిన్నతనం నుంచే అమెరికాలో తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. ప్రస్తుతం అక్కడే సైకియాట్రిస్ట్‌గా స్థిరపడ్డారు.
4. త్రిషాల తల్లి రిచా శర్మ ఎలా మరణించారు?
త్రిషాల తల్లి రిచా శర్మ 1996లో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించారు.
త్రిషాల దత్ నిర్ణయం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. గ్లామర్ ప్రపంచాన్ని కాదని, సమాజ సేవకు అంకితమైన ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని తాజా సినీ వార్తల కోసం మాతోనే ఉండండి!


