
Sanjay Rao : సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు సంజయ్ రావు. ఓ పిట్ట కథ, స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాలతో ప్రత్యేకమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సంజయ్ రావు హీరోగా తన నెక్స్ట్ సినిమా ప్రకటించాడు.
నేడు సంజయ్ రావు పుట్టిన రోజు సందర్భంగా హిట్ అండ్ రన్ అనే సినిమాని ప్రకటించారు. సంజయ్ రావ్, నటాషా సింగ్ మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌ల పై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మాణంలో సాయి కృష్ణ సాగర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో సంజయ్ రావ్ ఇంటెన్స్ లుక్, గాయాలు, రక్తంతో తడిచి ఉండటంతో ఇదేదో ఆసక్తిగా సాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవ్వబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ‘హిట్ అండ్ రన్’ టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


