
హిందీ సినిమా నటుడు సంజీవ్ కుమార్ జయంతి సందర్భంగా ఆయన జీవితం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. రెండు నేషనల్ అవార్డులు గెలుచుకున్నప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరమైనది. హేమమాలినితో ఆయన ప్రేమాయణం, ఇతర హీరోయిన్లతో సంబంధాలు, మద్యం సేవనం వంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
Key Points
రెండు నేషనల్ అవార్డుల గ్రహీత సంజీవ్ కుమార్
హేమమాలినితో ఆగిపోయిన వివాహం
హీరోయిన్లతో సంబంధాలు, వివాదాలు
మద్యం సేవనం, ఆత్మహత్య ప్రయత్నం
నేషనల్ అవార్డు విజేత
ఒక తరం మొత్తానికి సంజీవ్ కుమార్ నటన దాదాపు మిస్టరీగానే మిగిలిపోయింది. రాజేష్ ఖన్నా, దిలీప్ కుమార్ వంటి తన సమకాలీనుల లాగా ఆయన పాపులర్ కాలేకపోయారు. కానీ తనదైన పాత్రలతో అలరించారు. ఆయన జీవితంతో జాతీయ అవార్డులు, హీరోయిన్లతో రిలేషన్ షిప్, హేమ మాలినితో ఆగిపోయిన పెళ్లి.. ఇలా ఎన్నో విషయాలున్నాయి. ఇప్పుడు సంజీవ్ కుమార్ పేరు ట్రెండింగ్ లో ఉండటానికి కారణం జూలై 9న ఆయన జయంతి కావడమే.
1938 జూలై 9న హరిహర్ జెథాలాల్ జరివాలాగా జన్మించిన సంజీవ్ కుమార్ .. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు. దస్తక్ (1970), కోశిష్ (1972) సినిమాల్లో యాక్టింగ్ కు గాను ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా షోలే, ఆంధీ, నమ్కీన్, అనామిక వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఆయన ఎంత ఫేమస్ అయ్యారో ఆయన జీవితంలో వివాదాలు అదే స్థాయిలో ఉన్నాయి. హీరోయిన్లతో సంబంధాలు, హేమమాలిని తో ప్రేమాయణం, జీవిత చరమాంకంలో మద్యంతో పోరాటం చాలా మంది దృష్టిని ఆకర్షించాయి.
హేమమాలినితో సంబంధం
ది ఇండియన్ ఎక్స్ప్రెస్ స్క్రీన్ నివేదిక ప్రకారం.. సంజీవ్ కుమార్ కు అమ్మాయిల్లో ఎప్పుడూ పాపులారిటీ ఉండేది. తన గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువే. ‘ఏ అమ్మాయిని చూసినా నాతో చెప్పేవాడు. అతని గర్ల్ ఫ్రెండ్స్ కు 1, 2, 3 నెంబర్లు పెట్టాం. నెంబర్ 3 ఈ రోజు నాకు ఫోన్ చేసిందని, నెంబర్ 9 ఈ విధంగా స్పందించింది అని చెప్పేవాడు’ అని నటి అంజు మహేంద్రూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
హేమమాలిని, షబానా అజ్మీ, సైరా బాను, సులక్షణ పండిట్ సహా పలువురు పెద్ద హీరోయిన్లతో కుమార్ కు సంబంధాలు ఉన్నాయి. యాన్ యాక్టర్స్ యాక్టర్ అనే పుస్తకం ప్రకారం కుమార్ మాలినిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత యాక్టింగ్ మానేయాలని కండీషన్ పెట్టడంతో హేమ మాలిని ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సంజీవ్ సింగిల్ గానే మిగిలిపోయారు.
వివాదాలు మరియు వ్యక్తిగత జీవితం
1970 ల చివరలో సులక్షణ పండిట్ తనను వివాహం చేసుకోవాలని సంజీవ్ కుమార్ ను కోరింది. కానీ అతను నిరాకరించాడు. పండిట్ తన జీవితాన్ని సింగిల్ గానే గడిపారు. ఆయన తల్లి మతాంతర సంబంధానికి అంగీకరించకపోవడంతో అజ్మీతో అతని వివాహం కూడా జరగలేదు. ఆ తర్వాత మద్యం సేవించి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. గుండెపోటు రావడంతో బైపాస్ సర్జరీ చేయించుకుని మద్యపానాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.
అయితే 1985లో 47 ఏళ్ల వయసులో మరోసారి గుండెపోటు రావడంతో అభిమానులకు దూరమయ్యారు సంజీవ్ కుమార్ హిందీ సినిమాకు చేసిన కృషి అసమానమైనది, సాటిలేనిది.
సంజీవ్ కుమార్ జీవితం విజయాలతో పాటు వివాదాలతో నిండి ఉంది. ఆయన నటనకు గుర్తింపు లభించినా, వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలు ఆయనను వెంటాడాయి. అయినప్పటికీ, ఆయన హిందీ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.


