|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షూటింగ్‌కి వెళ్తే..ఆ హీరో నా చేతులు గట్టిగా పట్టుకొని నొక్కాడు : సంజనా

Published: 09-10-2025, 9:43 AM
షూటింగ్‌కి వెళ్తే..ఆ హీరో నా చేతులు గట్టిగా పట్టుకొని నొక్కాడు : సంజనా

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు తప్పవనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. నటి సంజనా గల్రానీ తన కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో హీరో తన చేతులను గట్టిగా పట్టుకొని ఎలా వేధించాడో వివరించింది.

Key Points

1

నటి సంజనా గల్రానీ బిగ్ బాస్ 9 తెలుగులో పాల్గొంటున్నారు.

2

కన్నడ షూటింగ్‌లో ఓ హీరో తన చేతులు గట్టిగా నొక్కాడని సంజనా వెల్లడించింది.

4

వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని కెరీర్‌లో ముందుకు సాగానని సంజనా చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో హీరోయిన్ల వేధింపులు: సంజనా అనుభవం

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు తప్పవనే టాక్ ‌ ఇప్పటికీ ఉంది . ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడితే .. అవకాశాల పేరుతో కొంతమంది .. అవసరాలకు మరికొంత మంది వారిని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటున్నారు . టాలెంట్ ‌ తో చాన్స్ ‌ దక్కించుకొని షూటింగ్ ‌ కి వెళ్తే .. అక్కడ కూడా వేధింపులు తప్పవు . చాలా మంది అలాంటి వేధింపులను భరించలేక .. ఇండస్ట్రీనే వదిలేశారు . కొంత మంది మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కొని కెరీర్ ‌ పరంగా ముందుకు సాగారు . అలాంటి వారిలో సంజన గల్రానీ ఒకరు . తన కెరీర్ ‌ లో ఎంతో మందితో వేధింపులు ఎదురయ్యాయని .. వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది .

తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలతో అలరించిన ఈ బ్యూటి.. ఇప్పుడు బిగ్ ‌ బాస్ ‌ తొమ్మిదో సీజన్ ‌(Bigg Boss 9 Telugu)లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ నటి బిగ్ ‌ బాస్ ‌ హౌస్ ‌ లోనే ఉంది . అయితే ఈమెకు సంబంధించిన ఓ పాట ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ ‌ గా మారింది . అందులో ఆమె కెరీర్ ‌ లో ఓ హీరోతో ఎదురైన ఇబ్బందిని పంచుకుంది . కన్నడ సినిమా షూటింగ్ ‌ లో ఓ హీరో తనను టార్చర్ ‌ చేశాడట . తన చేతులను పట్టుకొని గట్టిగా నొక్కాడట . నొప్పిగా ఉందని చెబితే .. మ్యానేజ్ ‌ చేసుకో అని దురుసుగా మాట్లాడినట్లు సంజనా చెప్పింది .

షూటింగ్ సెట్‌లో హీరో టార్చర్

‘ కన్నడలో ఓ సినిమా షూటింగ్ ‌ నాకు ఇబ్బందిగా అనిపించింది . పేరు చెప్పలేను కానీ ఓ హీరో నన్ను టార్చర్ ‌ పెట్టాడు . ఆ మూవీ డైరెక్టర్ ‌ తో అతనికి గొడవలు జరుగుతున్నాయి . అదే సమయంలో షూటింగ్ ‌ జరపగా .. హీరో వచ్చిన నా చేతులు గట్టిగా నొక్కాడు . వాస్తవానికి ఆ సీన్ ‌ లో హీరో నా చేతులు పట్టుకొని ముందుకు మూవ్ ‌ అవ్వాలి . కానీ ఆయన కోపంతో వచ్చి గట్టి గట్టిగా నొక్కాడు . నొప్పిగా ఉందని చెబితే .. మ్యానేజ్ ‌ చేసుకో అని సీరియస్ ‌ లుక్ ‌ తో చెప్పాడు . నేను కాసేపు షూటింగ్ ‌ నే ఆపేశా . ‘ నేను దెబ్బలు తినడానికి రాలేదు .. ఇదేం యాక్షన్‌ సీన్‌ కాదు.. నేను విలన్ ‌ కాదు .. ఈ సీన్ ‌ కి తగ్గట్టుగా నీ మైండ్ ‌ సెట్ ‌ మార్చుకో .. ఆ తర్వాతే షూట్ ‌ చేద్దాం ’ అని అరగంట తర్వాత మళ్లీ ఆ సీన్ ‌ చేశాం . ఇలాంటి క్రాక్ ‌ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు దొరుకుతారు . వారిని పట్టించుకోకుండా .. మన పని చేసుకొని పోవాలి ’ అని సంజన చెప్పుకొచ్చింది .

వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న సంజనా

టాలీవుడ్ ‌ చిత్రం సోగ్గాడు (2005) ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజనా .. తమిళంలో ఒరు కధల్ సేవిర్ ‌ తో తొలి విజయం అందుకుంది . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రం సంజన జీవితాన్నే మార్చేసింది . ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ , కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్ ‌ గా నటించింది .

సినిమా రంగంలో వేధింపులు కొత్త కాదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడమే ముఖ్యమని సంజనా మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె అనుభవం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.