
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుందా? అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Key Points
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా సంక్రాంతికి విడుదల కావచ్చు.
డిసెంబర్ 5 రిలీజ్ తేదీ వాయిదా పడే అవకాశాలున్నాయి.
జనవరి 9న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కావొచ్చు.
నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ది రాజా సాబ్ రిలీజ్ తేదీ
వచ్చే సంక్రాంతి పండక్కి రాజా సాబ్ థియేటర్స్‌కు రానున్నాడా? అంటే అవుననే సమాధానమే ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఫ్యాంటసీ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్నది తాజా టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సం్రాంతికి సినిమా విడుదల?
ప్రభాస్ చిత్రం విడుదల
ప్రస్తుతం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి బరిలో నిలవడానికి అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల టాక్.


