
📌 Key Points
- ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ.
- రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.3.96 కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రం.
- మొదటి రోజు రూ.1.89 కోట్లు, రెండో రోజు రూ.2.07 కోట్లు కలెక్షన్లు సాధించిన మూవీ.
- సంతోష్ శోభన్, మానస వారణాసిల జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
టాలీవుడ్‌లో సరికొత్త ప్రేమ కథతో సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ విడుదలైంది. ఈ సినిమా యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం!
రెండో రోజు కలెక్షన్ల సునామీ!
ప్రేమ కథలు ఇప్పుడు బోల్డ్ గా మారిపోయాయి. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. కొన్ని జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ వచ్చి ఆకట్టుకుంటోంది. అదే `కంపుల్ ఫ్రెండ్లీ`. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై అజయ్ కుమార్ రాజు పి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రేమికుల రోజు సందర్భంగా శనివారం విడుదలైంది.
సరికొత్త ప్రేమ కథతో రూపొందిన చిత్రం కావడంతో ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. యూత్ చూసేలా మూవీ ఉంది. అయితే టైటిల్ మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. దీనికితోడు `ఏ` సర్టిఫికేట్ కూడా మూవీకి పెద్ద సమస్యగా మారింది. యూత్‌ని దూరం చేసింది. ఫ్యామిలీని దూరం చేసింది. అది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. వసూళ్లు తగ్గాయి. మొదటి రోజు ఈ మూవీ రూ.1.89కోట్లు వసూలు చేసింది.
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీకి యూత్ ఫిదా!
`కపుల్ ఫ్లెండ్లీ` మూవీ రెండో రోజు రూ.2.07కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు పెరగడం విశేషం. ఇది ఈ మూవీ రిజల్డ్ ని తెలియజేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మౌత్ టాక్‌తో జనంలోకి వెళ్తుంది. నెమ్మదిగా పుంజుకుంటోంది. అందుకే రెండో రోజు పెరిగాయి. మొత్తంగా ఈ మూవీ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.3.96కోట్లు వసూలు చేసింది. చూడబోతుంటే నెమ్మదిగా పుంచుకునే అవకాశం కనిపిస్తుంది.
ఈ సినిమాకి ఆరు కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. సినిమా హిట్ కావాలంటే, బయ్యర్లు సేఫ్ కావాలంటే ఆరున్నర కోట్లు రావాలి. అంటే సుమారు రూ.13కోట్ల గ్రాస్ రావాలి. ఇలానే స్టడీగా కొనసాగితే ఈజీగా దాటేస్తుందని చెప్పొచ్చు. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. సోమవారం సినిమాకి అసలు పరీక్షగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ధీరజ్ మొగిలినేని డిస్ట్రిబ్యూట్ చేశారు.
బాక్సాఫీస్ వద్ద సంతోష్ శోభన్ ప్రభంజనం!
శివ, మిత్ర అనే ఇద్దరి జంట కథ ఇది. జాబ్ కోసం వెర్వేరుగా చెన్నై వెళ్లిన ఈ ఇద్దరు ఎలా కలుసుకున్నారు, ఎలా ఒక్కటయ్యారు? ఎలా ఒకరికి సపోర్ట్ గా మరొకరు నిలిచారు. ఎలా ప్రేమలో పడ్డారు? అనేది సినిమా. ప్రేమలో పీక్‌లోకి వెళ్లి నేపథ్యంలో తమ జీవితంలోకి విషాదం రావడం, అమ్మాయి అనారోగ్యానికి గురి కావడం ఇందులో కదిలించే పాయింట్. ఫ్రెష్ లవ్ స్టోరీ అలరిస్తూనే కామెడీ ఆకట్టుకుంటుంది. చివర్లో విషాదంగా ముగుస్తుంది. ఇది సరికొత్త ప్రేమని పరిచయం చేస్తూ, రొమాన్స్ తో అలరిస్తూ, నవ్విస్తూ, కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పొచ్చు.
సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


