
📌 Key Points
- సారా అర్జున్ నటించిన ‘ధురంధర్’ మూవీతో భారీ ఫేమ్, కలెక్షన్ల వర్షం కురిసింది!
- ఫిబ్రవరి 6న గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’ విడుదల కానుంది.
- ‘యుఫోరియా’లో భూమిక చావ్లా, నాజర్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.
- తల్లిదండ్రుల ఆనందంతో సారా అర్జున్ జీవితంలోనే మరపురాని రోజు అది!
బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ‘ధురంధర్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు ‘యుఫోరియా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే హాట్ టాపిక్‌గా మారింది.
‘ధురంధర్’తో సారా అర్జున్ సంచలనం!
బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ సారా అర్జున్(Sara Arjun) ‘ధురంధర్’(Dhurandhar) సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిందని చెప్పాలి. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బామ మొదటి మూవీతోనే ఊహించని విధంగా ఫేమ్ దక్కించుకుంది. ఈ ‘ధురంధర్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. భారీ కలెక్షన్లు రాబట్టి పలు సంచలన రికార్డులు క్రియేట్ చేయడంతో సారా అర్జున్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ‘యుఫోరియా’ (Euphoria)చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్స్‌లోకి విడుదల కాబోతుంది.
‘యుఫోరియా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
యువతలో డ్రగ్స్ సంస్కృతి, సామాజిక విలువలు పడిపోవడం వంటి అంశాలతో రాబోతుండగా.. ఇందులో భూమిక చావ్లా, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సారా అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘ధురంధర్’ చూసిన తర్వాత మీ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారని యాంకర్ ప్రశ్నించగా.. సారా అర్జున్ సామాధాన మిస్తూ..“నేను చేసిన ‘ధురంధర్’ సినిమా వల్ల నా తల్లిదండ్రులకు ఆనంద భాష్పాలు వచ్చాయి. అదే నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు. అది నాకు చాలా ప్రత్యేకమైనది” అని చెప్పింది. ఇక తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. పొన్నియిన్ సెల్వన్ తర్వాత, నేను బోర్డింగ్ స్కూల్‌కు వెళ్ళాను, ఆ తర్వాత నా యాక్టింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి విదేశాలకు వెళ్లాలని అనుకున్నాను.
తల్లిదండ్రుల రియాక్షన్‌పై సారా ఎమోషనల్!
కానీ నేను నా బోర్డ్ పరీక్షలు రాస్తున్నప్పుడే ‘మ్యాజిక్’ చిత్రానికి సంతకం చేశాను. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ నా ప్లాన్‌కే కట్టుబడి ఉన్నాను. కానీ ‘యుఫోరియా’ నా వద్దకు వచ్చింది. ఇక స్క్రీప్ట్ చదివిన తర్వాత అది చేయడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. ఒక మనిషిగా ఇలాంటి కథలో భాగం కావాలనే కోరిక నాకు కలిగింది. ‘పొన్నియన్ సెల్వన్’ తర్వాత ‘మ్యాజిక్’, ఆ తర్వాత ‘యుఫోరియా’ ఆ తర్వాత ‘ధురంధర్’ వరుస అవకాశాలు వచ్చాయి. నిజానికి, నేను ‘యుఫోరియా’ షూటింగ్ చేస్తున్నప్పుడే ‘ధురంధర్’ చిత్రానికి సంతకం చేశాను.. కానీ అది ముందుగా విడుదలైంది’’ అని చెప్పింది.
సారా అర్జున్ ‘యుఫోరియా’ మూవీతో టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా గురించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


