
📌 Key Points
- సారా అర్జున్ సంచలనం: గ్లామర్ పాత్రలకు గుడ్ బై చెప్పేసిన బ్యూటీ!
- ‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ హిట్: సారా అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది!
- సమాజంలో చర్చలు రేకెత్తించే ‘యుఫోరియా’, ‘మ్యాజిక్’ చిత్రాల ఎంపిక!
- గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’: సామాజిక అంశాలపై సారా పోరాటం!
యంగ్ సెన్సేషన్ సారా అర్జున్ సంచలన నిర్ణయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
గ్లామర్ పాత్రలకు సారా గుడ్ బై!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది సారా అర్జున్(Sara Arjun). ఇక ఇటీవల ‘ధురంధర్’(Dhurandhar)సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయి.. సెన్సేషనల్ బ్యూటీగా మారింది. హీరోయిన్‌గా చేసిన తన మొదటి మూవీనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు పలు సంచలన రికార్డులు క్రియేట్ చేయడంతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఊహించని పాపులారిటీ దక్కడంతో పాటుగా.. వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా అర్జున్ తనకు గ్లామర్ పాత్రలకంటే.. సవాళ్లతో కూడిన పాత్రలకే తాను ప్రాధాన్యత ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ‘‘నటిగా గ్లామర్ కాదు.. సవాళ్లతో కూడిన పాత్రలు, బలమైన కథలే ముఖ్యం.
‘ధురంధర్’ తో ఒక్కసారిగా స్టార్ డమ్!
కేవలం నటించడమే కాకుండా, మెరుగుపరుచుకుంటూ ఒక కళాకారిణిగా ఎదిగేందుకు అవకాశం ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తాను. అందుకే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ, సమాజంలో చర్చలు రేకెత్తించే అంశాలు ఉన్న ‘యుఫోరియా’ , ‘మ్యాజిక్’ (Magic) వంటి చిత్రాలను ఎంచుకున్నా. నిజానికి ‘ధురంధర్’ కంటే ముందే నేను యుఫోరియాకు సంతకం చేశాను. కేవలం నటిగానే కాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఈ కథలను జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ప్రస్తుత యువతకు ఇలాంటి కథలు చాలా అవసరమని బలంగా నమ్ముతున్నాను. ఈ చిత్రాల ద్వారా సమాజంలో మార్పు రావాలని, యువతలో ఆలోచనలు మొదలవ్వాలని అనుకుంటున్నా.
సమాజం కోసం సారా కొత్త నిర్ణయం!
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘యుఫోరియా’ చిత్రంలోని కథాంశం నన్ను అమితంగా ఆకట్టుకుంది. అందుకే ఉన్నత చదువుల కంటే ముందే ఈ సినిమా చేయడానికి అంగీకరించా. గుణశేఖర్ వంటి గౌరవనీయమైన దర్శకుడి పర్యవేక్షణలో పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ‘యుఫోరియా’ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, సమాజంలో చర్చ జరగాల్సిన ముఖ్యమైన సామాజిక అంశాలను స్పృశిస్తుంది. ఈ చిత్రం సమాజానికి ఒక అర్ధవంతమైన సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులు సామాజిక సమస్యలపై ఆలోచించేలా చేస్తుంది. ఒక నటిగా నాకు సవాలు విసిరే పాత్రలను చేయడమే నా మొదటి ప్రాధాన్యత’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సారాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సారా అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె భవిష్యత్తు ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


