|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోదీని అనే రేంజ్‌ ఉందా.. విజయ్‌పై శరత్‌కుమార్‌ విమర్శలు

Published: 22-08-2025, 10:45 PM
మోదీని అనే రేంజ్‌ ఉందా.. విజయ్‌పై శరత్‌కుమార్‌ విమర్శలు

తమిళ నటుడు విజయ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకేలపై విమర్శలు చేసిన విజయ్ పై శరత్ కుమార్ తీవ్రంగా స్పందించారు.

Key Points

1

విజయ్‌ చేసిన వ్యాఖ్యలపై శరత్‌కుమార్‌ తీవ్ర విమర్శలు.

2

మోదీని సంబోధించే స్థాయికి విజయ్‌ ఇంకా ఎదగలేదని శరత్‌కుమార్‌ వ్యాఖ్య.

4

విజయకాంత్‌ సతీమణి ప్రేమలత విజయ్‌కు మద్దతు ప్రకటించారు.

విజయ్ వ్యాఖ్యలు రచ్చ

మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రచ్చకెక్కాయి. తాను సింగిల్‌గానే 2026లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన  బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కూటమి వర్గాలపై విమర్శలు చేశారు. దీంతో అక్కడి అన్ని పొలిటికల్‌ పార్టీలు విజయ్‌పై ముప్పెట్ట దాడి చేసేందుకు దిగాయి.

శరత్ కుమార్ విమర్శలు

విజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌ నేత, నటుడు శరత్‌కుమార్‌ రియాక్ట్‌ అయ్యారు. సిద్ధాంత పరంగా విజయ్‌ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మిస్టర్‌ పీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ముందుగా పాసిజం అంటే ఏమిటో తెలుసుకుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆపై అన్నాడీఎంకే నేతలు కూడా ఫైర్‌ అయ్యారు. రాజకీయాల్లో అందరూ ఎంజీఆర్‌, జయలలితలు కాలేరని ఎద్దేవాచేశారు.

విజయకాంత్ సతీమణి మద్దతు

దివంగత నటుడు విజయకాంత్‌ ఆశీస్సులు విజయ్‌కి  ఉంటాయని ఆయన సతీమణి ప్రేమలత అన్నారు. విజయ్‌ తమ ఇంటి బిడ్డ అని ఆమె అన్నారు. విజయ్‌ వ్యాఖ్యలు కూడా విజయకాంత్‌ను గుర్తుచేస్తున్నాయని డీఎండీకే నేత ప్రేమలత అన్నారు. ప్రస్తుతం విజయ్‌కి సపోర్ట్‌గా  విజయకాంత్‌ సతీమణి రావడం అభిమానులు సంతోషిస్తున్నారు.

విజయ్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. శరత్ కుమార్, అన్నాడీఎంకే నేతల విమర్శలతో పాటు, విజయకాంత్ సతీమణి మద్దతు విషయం ఆసక్తికరంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.