
📌 Key Points
- శర్వానంద్ ‘బైకర్’ ట్రైలర్ విడుదల: యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి!
- ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!
- తండ్రీ కొడుకులుగా రాజశేఖర్, శర్వానంద్ స్క్రీన్ షేరింగ్
- యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో చిత్రం నిర్మాణం
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాల్ని రెట్టింపు చేసింది. ఈ మూవీలో శర్వానంద్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.
ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన శర్వానంద్
Biker Trailer : హీరో శర్వానంద్ నటిస్తున్న చిత్రం బైకర్. అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాళవికా నాయర్ కథానాయిక. రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజశేఖర్ డైలాగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్
జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీగా రూపొందుతున్న బైకర్
‘నువ్వు అందరికంటే ముందు రాలేదు.. అందరూ నీకంటే వెనుక వచ్చారు, రెండిటికీ చాలా తేడా ఉంది.’ అని రాజశేఖర్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ‘బైకర్ అంటే స్పీడ్ కాదు..రెస్పెక్ట్’ అంటూ వచ్చే డైలాగ్‌లు బాగునున్నాయి. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది. తండ్రీ, కొడుకులు రాజశేఖర్, శర్వానంద్ లు నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
శర్వానంద్ ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


