|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇలాంటి క్లైమాక్స్ తెలుగులో ఇంతవరకు చూడలేదు.. మూవీ పూర్తి కాకముందే రైట్స్ అన్ని అమ్ముడుపోయాయి: శశివదనే నిర్మాత అహితేజ

Published: 04-10-2025, 9:21 PM
ఇలాంటి క్లైమాక్స్ తెలుగులో ఇంతవరకు చూడలేదు.. మూవీ పూర్తి కాకముందే రైట్స్ అన్ని అమ్ముడుపోయాయి: శశివదనే నిర్మాత అహితేజ

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘శశివదనే’ చిత్రం ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. నిర్మాత అహితేజ మాట్లాడుతూ సినిమా క్లైమాక్స్ అత్యంత కొత్తగా ఉంటుందని, చిత్రం విడుదల కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయని తెలిపారు. అక్టోబర్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ నటించిన 'శశివదనే' చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది.

2

సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయని నిర్మాత అహితేజ బెల్లంకొండ తెలిపారు.

4

హీరోయిన్ కోమలి ప్రసాద్ క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని, అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని పేర్కొంది.

నిర్మాత అహితేజ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగులో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై శశివదనే సినిమాను అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.

సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన శశివదే సినిమాను అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగాంగా ఇవాళ శనివారం (అక్టోబర్ 4) నాడు మీడియా ప్రెస్ మీట్ నిర్వహించారు శశివదనే మూవీ టీమ్. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో నిర్మాత అహితేజతోపాటు హీరోయిన్ కోమలి ప్రసాద్ తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత అహితేజ మాట్లాడుతూ .. “శశి వదనే కోసం మేం ఎంత కష్టపడ్డా కూడా ఆడియెన్స్‌కి మంచి అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మాకు ముందు నుంచీ కూడా మీడియా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీ ఏ ఒక్కరినీ కూడా నిరాశ పరచదు” అని అన్నారు.

శశివదనే క్లైమాక్స్ ప్రత్యేకత

“నాకు అంతగా అనుభవం లేకపోవడంతోనే శశివదనే రిలీజ్‌లో జాప్యం కలిగింది. కంటెంట్ మీద మా అందరికీ నమ్మకం ఉంది. సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయి. నన్ను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లందరికీ ధన్యవాదాలు” అని ప్రొడ్యూసర్ అహితేజ తెలిపారు.

“మా మూవీ శశివదనే ట్రైలర్‌ అందరికీ నచ్చింది. ‘శశివదనే’ లాంటి క్లైమాక్స్‌ను నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇంత వరకు చూడలేదు. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఎస్‌కేఎన్ గారికి, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అనీష్, డైరెక్టర్ యోగి అన్నకి, అండగా ఉన్న మీడియాకి, మా పీఆర్ టీంకి థాంక్స్” అని నిర్మాత అహితేజ తన స్పీచ్ ముగించారు.

హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ .. “శశివదనే నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను ఇందులో పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ టీంలోని చాలా మంది కొత్త వారే. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్‌లో అందరినీ మా సినిమా కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది” అని చెప్పుకొచ్చారు.

అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్

“‘ శశివదనే ’ టీం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించింది. గౌరీ గారు, అహితేజ గారు ఎంతో ప్యాషనేట్‌గా ఈ మూవీని నిర్మించారు. ట్రైలర్ అందరికీ రీచ్ అయింది. దర్శకుడు, రక్షిత్, కోమలి, టీం ఇలా అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి” అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ పేర్కొన్నారు.

నటి అంబికా మాట్లాడుతూ .. “‘శశి వదనే’ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అక్టోబర్ 10న వస్తుందని ఆశిస్తున్నాను. మా అందరికీ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ లభించాలని కోరుకుంటున్నాను” అని వెల్లడించారు.

నిర్మాత అహితేజ, హీరోయిన్ కోమలి ప్రసాద్ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. శశివదనే చిత్రం అక్టోబర్ 10న విడుదల కానున్న నేపథ్యంలో, ఆడియన్స్ కు మంచి అనుభూతిని ఇస్తుందని టీమ్ నమ్మకం వ్యక్తం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.