|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సైకిల్ పాప కోసం గోదారి దాటే ప్రేమికుడు- మనసుకు హత్తుకునే డైలాగ్స్, ముద్దు సీన్లతో శశివదనే ట్రైలర్ రిలీజ్

Published: 29-09-2025, 10:00 AM
సైకిల్ పాప కోసం గోదారి దాటే ప్రేమికుడు- మనసుకు హత్తుకునే డైలాగ్స్, ముద్దు సీన్లతో శశివదనే ట్రైలర్ రిలీజ్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం ‘శశివదనే’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గోదావరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో మనసుకు హత్తుకునే డైలాగ్స్, భావోద్వేగ సన్నివేశాలు, ముద్దు సీన్లు ఆకట్టుకుంటున్నాయి. సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది.

Key Points

1

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన 'శశివదనే' ట్రైలర్ విడుదలైంది.

2

గోదావరి నేపథ్యంతో కూడిన ఈ ప్రేమకథలో భావోద్వేగ డైలాగ్స్, సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

4

అక్టోబర్ 10న 'శశివదనే' సినిమా థియేటర్లలోకి రానుంది.

శశివదనే ట్రైలర్ హైలైట్స్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల శశివదనే సినిమాను నిర్మించారు.

శశివదనే సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ శశివదనే సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 29) శశివదనే మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘గల గల పారే గోదావరి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి ఉన్న లవ్ డెప్త్ ఏంటో చెబుతోంది.

ప్రేమకథ, భావోద్వేగ సన్నివేశాలు

‘లంకలోని సీత కోసం రాముడు సముద్రాలు దాటినట్లు.. నీ సైకిల్ పాప కోసం నువ్వు ఈ గోదారి దాటుతున్నావన్నమాట’ అనే డైలాగ్ చూస్తే తన మనసుకి నచ్చిన ప్రేయసి కోసం హీరో గోదారి దాటి వెళ్లి అన్వేషిస్తాడని, దానికి తగినట్లుగానే ఉన్న సన్నివేశాలతో బాగా చూపించారు. చివరకు హీరోయిన్‌ కనపడగానే హీరో పడే భావోద్వేగ సన్నివేశాలు ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి.

‘ఆడపిల్లలు మన జీవితంలోకి కోరికలతోను, ఆశలతోను రారురా.. జీవితంలో తోడుగా ఉంటామని భరోసాతో వస్తారు.. మనతో చేయ్యట్టుకుని ఏడడుగులు నడుస్తారు’, ‘నాకు ఊహ తెలియని వయసు నుంచి నా అనుకున్న బంధం నాన్న.. ఉహ తెలిసిన తర్వాత నా అనుకున్న బంధం మీరు’ అంటూ హీరోయిన్‌కి హీరో తన ప్రేమను చెప్పే డైలాగ్స్ హృద్యంగా ఉన్నాయి.

ఆ డైలాగ్స్‌కి ‘ఇంత ప్రేమ నా నుంచి ఎప్పటికీ దూరం కాదుగా రాఘవ’ అంటూ హీరోయిన్ ప్రేమగా హీరోని రిక్వెస్ట్ చేసే సన్నివేశం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలియజేస్తోంది. ‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ అని హీరోకి తండ్రి చెప్పటం చూస్తే ప్రేమలో హీరోకి ఎదురైన సమస్య గురించి తెలుస్తుంది.

చిత్ర యూనిట్, విడుదల తేదీ

అక్కడి నుంచి మనకు విలన్ పాత్ర ఎలా ఉండబోతుంది.. తన వల్ల హీరో పడ్డ ఇబ్బందులను ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ‘జాగ్రత్తగా వెళ్లి.. జాగ్రత్తగా తిరిగి రా’ అంటూ హీరోకి హీరోయిన్ జాగ్రత్త చెప్పటం, ‘ప్రేమతో వెళ్తున్నా.. వచ్చాక ప్రపంచాన్నే గెలుద్దాం’ అని హీరో చెప్పటం.. దానికి హీరో నుంచి హీరోయిన్ ఎమోషనల్ గా కిస్ పెట్టి ప్రామిస్ తీసుకోవటంతో శశివదనే ట్రైలర్ ముగిసింది.

గోదావరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలోని సన్నివేశాలు ట్రైలర్‌లోనే హృదయాలను హత్తుకుంటుంటే సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ అయితే కలుగుతోంది. శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.

సాయికుమార్ దారా అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు గ్యారీ బి.హెచ్. ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా, శశివదనే సినిమాలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్‌తోపాటు శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

మొత్తంగా, ‘శశివదనే’ ట్రైలర్ ఒక అందమైన, భావోద్వేగ ప్రేమకథను పరిచయం చేసింది. ఆకట్టుకునే డైలాగ్స్, విజువల్స్‌తో సినిమాపై అంచనాలను పెంచింది. అక్టోబర్ 10న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.