|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకు బోట్ డ్రైవ్ చేయడం రాదు.. నేను, విజయ్ దేవరకొండ చెట్ల కొమ్మల్లోకి వెళ్లిపోయాం.. హీరో సత్యదేవ్ కామెంట్స్ (కింగ్డమ్)

Published: 06-08-2025, 9:41 PM
నాకు బోట్ డ్రైవ్ చేయడం రాదు.. నేను, విజయ్ దేవరకొండ చెట్ల కొమ్మల్లోకి వెళ్లిపోయాం.. హీరో సత్యదేవ్ కామెంట్స్ (కింగ్డమ్)

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటించిన కింగ్డమ్ సినిమా గురించి సత్యదేవ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. బోట్ డ్రైవింగ్ సన్నివేశాలు, ప్రమాదకర సమయాలు, విజయ్ దేవరకొండతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.

Key Points

1

సత్యదేవ్, విజయ్ దేవరకొండల కింగ్‌డమ్ సినిమా షూటింగ్ సమయంలోని ఆసక్తికర అనుభవాలు

2

బోట్ డ్రైవింగ్‌లో సత్యదేవ్ అనుభవం, ప్రమాదకర సన్నివేశాలు

4

కింగ్‌డమ్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల స్పందన

కింగ్డమ్ సినిమా షూటింగ్ అనుభవాలు

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించిన రీసెంట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా కింగ్డమ్ . మళ్లీ రావా, జెర్సీ సినిమాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో హీరో సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

-ఎప్పుడైనా యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలని నేను నమ్ముతాము. ఇందులో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే.. నా యాక్షన్ సీన్స్‌కి అంత మంచి స్పందన వస్తోంది.

బోట్ డ్రైవింగ్ సన్నివేశం

– విజయ్ దేవరకొండ నా తమ్ముడు అని తెలిసిన తర్వాత జైల్లో మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తమ్ముడంటే మనసులో ఎంతో ప్రేమ ఉన్నా.. పైకి మాత్రం అది పూర్తిగా చూపించకూడదు. ఎందుకంటే తమ్ముడు ‘నాతో ఉండిపోతాను’ అంటాడనే భయం నాలో ఉంటుంది.

-అసలు గౌతమ్ నా పాత్రను రాసిన తీరే అద్భుతంగా ఉంది. ఓ వైపు తమ్ముడు, మరోవైపు దివి ప్రజలు, ఇంకో వైపు ఒక నిజం తెలుసు కానీ ఎవరికీ చెప్పలేడు. ఇలా ఆ పాత్ర చుట్టూ ఎంతో ఎమోషన్ ఉంది. అందుకే డ్రామా అంతలా పండింది. సినిమాలో ఫిజికల్‌గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ మాత్రం ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక.. ఆ కష్టమంతా మరిచిపోయాను.

ప్రమాదకర సన్నివేశాలు మరియు అనుభవాలు

-ఆ సీక్వెన్స్ కోసం కూడా చాలా కష్టపడ్డాము. నిజానికి నాకు బోట్ డ్రైవ్ చేయడం రాదు. కానీ, నన్ను నమ్మి విజయ్ బోట్‌లో కూర్చోవాలి. ఆ నీటి ప్రవాహానికి తగ్గట్టుగా దానిని నడపాలి. కుడి వైపుకి తిప్పితే ఎడమ వైపుకి వెళ్తుంది.. ఎడమ వైపుకి తిప్పితే కుడి వైపుకి వెళ్తుంది. మొదట చాలా భయం వేసింది.

-ఆ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడ్డాము. ఓసారి నేను, విజయ్ దేవరకొండ చెట్ల కొమ్మల్లోకి వెళ్లిపోయాం. మరోసారి చెట్టు మీద పడబోయింది. దాంతో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బోట్ నడిపాను.

చివరగా, కింగ్డమ్ సినిమా షూటింగ్ సమయంలో సత్యదేవ్ ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రేక్షకుల స్పందన చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.