|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సత్యదేవ్‌ కోటి రూపాయల ఆర్టిస్ట్‌.. ఆ మార్క్‌ ఎప్పుడో దాటేశాడు!

Published: 17-07-2025, 7:13 AM
సత్యదేవ్‌ కోటి రూపాయల ఆర్టిస్ట్‌.. ఆ మార్క్‌ ఎప్పుడో దాటేశాడు!

ప్రముఖ నటుడు సత్యదేవ్‌ గురించి ఆసక్తికరమైన వార్తలు వెలువడ్డాయి. నిర్మాత విజయ్ డొంకాడ సత్యదేవ్‌ త్వరలోనే కోటి రూపాయల ఆర్టిస్ట్‌ అవుతాడని ప్రకటించారు. సత్యదేవ్‌ ప్రస్తుతం అనేక చిత్రాలలో నటిస్తున్నాడు.

Key Points

1

సత్యదేవ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

2

నిర్మాత విజయ్ డొంకాడ సత్యదేవ్ కోటి రూపాయల ఆర్టిస్ట్ అవుతాడని అన్నారు.

4

పరదా సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది.

సత్యదేవ్‌ నటించిన తాజా చిత్రాలు

టాలెంట్‌ ఆర్టిస్ట్‌ సత్యదేవ్‌ ( Satyadev ) మొదట్లో హీరో స్నేహితుడి పాత్రలు చేసేవాడు. తర్వాత విలనిజం చేశాడు. అలాగే హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనూ యాక్ట్‌ చేశాడు. కానీ ఎడిటింగ్‌లో తను కనిపించే దాదాపు 16 నిమిషాల సీన్లను లేపేశారు. కావాల్సినంత ప్రతిభ ఉన్నా.. ఎందుకో కాస్త వెనకబడుతున్నాడు. ఇతడు చివరగా నటించిన జీబ్రా కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది.

నేనప్పుడే చెప్పా.. కానీ సత్యదేవ్‌ దమ్మున్న నటుడని మాత్రం పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతడు కింగ్‌డమ్‌ మూవీలో విజయ్‌ దేవరకొండ సోదరుడిగా నటిస్తున్నాడు. అలాగే సత్యదేవ్‌ చేతిలో ఫుల్‌ బాటిల్‌, గరుడ: చాప్టర్‌ 1 చిత్రాలున్నాయి. తాజాగా ఇతడు పరదా సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ క్రమంలో నిర్మాత విజయ్‌ డొంకాడ.. సత్యదేవ్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. సత్యతో 47 డేస్‌ సినిమా చేశాను. భయ్యా.. నువ్వు త్వరలోనే కోటి రూపాయల ఆర్టిస్టువి అవుతావు అని ఆ సినిమా షూటింగ్‌లోనే అన్నాను.

నిర్మాత విజయ్ డొంకాడ కామెంట్స్

చాలా టాలెంట్‌ ఆ రూ.1 కోటి మార్కు ఆయన ఎప్పుడో దాటేశారు. సత్య చాలా టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. ఆయన నాకు ఫ్యామిలీ మెంబర్‌లానే అనిపిస్తాడు అని చెప్పుకొచ్చాడు. పరదా సినిమా విషయానికి వస్తే.. ఇందులో అనుపమ ప్రధాన పాత్రలో నటించింది. ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వం వహించగా విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగస్టు 22న పరదా విడుదల కానుంది.

పరదా సినిమా విడుదల తేదీ

నిర్మాత వ్యాఖ్యల ద్వారా సత్యదేవ్‌ నటనకు గుర్తింపు లభించింది. అతని రానున్న చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పరదా సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.