
తమిళనాడు కరూర్‌లో విజయ్ ర్యాలీలో జరిగిన ఘోర తొక్కిసలాటపై సినీ నటుడు సత్యరాజ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 40 మంది మరణించగా, 80 మంది గాయపడ్డారు. విజయ్ నిర్లక్ష్యం వహిస్తున్నారని సత్యరాజ్ పరోక్షంగా ‘ఛీ’ అంటూ విమర్శలు గుప్పించారు.
Key Points
కరూర్‌లో విజయ్ ర్యాలీలో 40 మంది మృతి, 80 మందికి గాయాలు
రజనీ, కమల్ తర్వాత కరూర్ ఘటనపై సత్యరాజ్ స్పందన
విజయ్ నిర్లక్ష్యాన్ని 'ఛీ' అంటూ సత్యరాజ్ పరోక్షంగా విమర్శించారు
విజయ్ సభల్లో గతంలోనూ అనేక ప్రమాదాలు, మరణాలు నమోదు
కరూర్ ఘటన: అసలేం జరిగింది?
తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి స్టార్స్ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నటుడు సత్యరాజ్ రియాక్ట్ అయ్యారు. విజయ్‌పై ఆయన విమర్శలు చేశారు.
సత్యరాజ్ ఆగ్రహం: విజయ్ నిర్లక్ష్యంపై విమర్శలు
కరూర్ ఘటన గురించి సత్యరాజ్ ఇలా అన్నారు.. ” ఒక్కోసారి తప్పులు అనేవి మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. కానీ, తెలిసి ఎవరైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది చిన్న తప్పు అయితే, దాన్ని సరిచేసుకోవాలి. ఒకవేళ అది అనుకోకుండా పెద్దదైతే మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఛీ!” అంటూ సత్యరాజ్ పోస్ట్ చేశారు.
విజయ్ సభల్లో ప్రమాదాల చరిత్ర
విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయన సభల్లో 8మంది మరణించారు. తను ప్రయాణించే వాహనం కింద బైకర్స్ పడిపోయి కొందరు తీవ్రంగానే గాయపడ్డారు. ఇలా తరుచుగా విజయ సభల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతను కట్టడి చేయడం తమిళనాడు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయం కోర్టుకు కూడా తెలిపారు. ఇప్పుడు సినీ నటుడు సత్యరాజ్ కూడా దానిని పరోక్షంగా చెప్పారు. తను పాల్గొంటున్న ర్యాలీలో ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం విజయ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని సత్యరాజ్ పరోక్షంగా చెప్పారు.
మొత్తంగా, కరూర్ ఘటనపై సత్యరాజ్ వ్యాఖ్యలు విజయ్ రాజకీయ ర్యాలీల భద్రతా లోపాలను మరోసారి ఎత్తి చూపాయి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ పరిణామం హెచ్చరిస్తోంది.


