|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సయ్యారా.. రూ.500 కోట్ల క్లబ్‌లోకి సయ్యారా.. ఇండియాలో అత్యధిక వసూళ్ల లవ్ స్టోరీ ఇదే

Published: 05-08-2025, 10:42 AM
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సయ్యారా.. రూ.500 కోట్ల క్లబ్‌లోకి సయ్యారా.. ఇండియాలో అత్యధిక వసూళ్ల లవ్ స్టోరీ ఇదే

బాలీవుడ్ రొమాంటిక్ మ్యూజికల్ సినిమా సయ్యారా సంచలన విజయం సాధించింది. మూడు వారాల్లో రూ.500 కోట్లను దాటిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన లవ్ స్టోరీగా నిలిచింది.

Key Points

1

సయ్యారా మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

2

ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన లవ్ స్టోరీగా నిలిచింది.

4

యూత్ ఆడియన్స్‌లో సయ్యారాకు మంచి ఆదరణ లభించింది.

సయ్యారా సినిమా బాక్సాఫీస్ విజయం

బాలీవుడ్ మూవీ సయ్యారా సంచలన బాక్సాఫీస్ రన్ కొనసాగుతోంది. కొత్త నటీనటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ మూవీ మూడు వారాల్లో రూ.500 కోట్ల మార్కును దాటింది. ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) షేర్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన లవ్ స్టోరీ కావడం విశేషం.

సయ్యారా ఈ ఏడాది అసలు ఊహించని హిట్. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా తమ మూవీ సాధించిన ఘనత గురించి షేర్ చేస్తూ.. “సయ్యారా మీ హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకుంది. అందుకు మేము ఎంతో కృతజ్ఞులం” అని రాసింది.

యష్ రాజ్ ఫిల్మ్స్ టీమ్ ప్రకారం ‘సయ్యారా’ 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.507 కోట్లు వసూలు చేసింది. సినిమాను నిర్మించిన వైఆర్ఎఫ్ సీఈఓ అక్షయ్ విధాని మాట్లాడుతూ.. “యువ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. థియేటర్లకు వాళ్లు వస్తారా లేదా అని ఉన్న సందేహాలను ఇది తొలగించింది. ‘సయ్యారా’ను ఈ కాలపు ముఖ్యమైన ప్రేమకథగా మార్చిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు” అని అన్నాడు.

రూ.500 కోట్ల మార్క్‌ను దాటిన సయ్యారా

అయితే సయ్యారా నిజంగానే రూ.500 కోట్లు దాటిందా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ ప్రకారం.. ‘సయ్యారా’ నెట్ వసూళ్లు రూ.302.10 కోట్లు, గ్రాస్ రూ.362.50 కోట్లుగా ఉన్నాయి. విదేశాల్లో రూ.130 కోట్ల కలెక్షన్‌తో.. ‘సయ్యారా’ మొత్తం ప్రపంచవ్యాప్త కలెక్షన్ రూ.492.50 కోట్లుగా ఉంది. కానీ సినిమా టీమ్ మాత్రం ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటినట్లు స్పష్టం చేస్తోంది.

‘సయ్యారా’ 18 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.308 కోట్లు, గ్రాస్ రూ.376 కోట్లు సంపాదించిందని పేర్కొంది. ఓవర్సీస్ నుంచి వచ్చిన రూ.131 కోట్లతో కలిపి మొత్తం రూ.507 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన లవ్ స్టోరీ ఆ పోస్టర్ పై రాసి ఉంది.

అత్యధిక వసూళ్ల లవ్ స్టోరీ

ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ‘ఛావా’ (ప్రపంచవ్యాప్తంగా రూ.807.91 కోట్లు) తర్వాత ‘సయ్యారా’ రెండో స్థానంలో ఉంది. ఈ కలెక్షన్‌తో ‘సయ్యారా’.. హృతిక్ రోషన్ నటించిన ‘వార్’ (రూ.471 కోట్లు), షారూఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ (రూ.454 కోట్లు) సినిమాల జీవితకాల కలెక్షన్‌లను అధిగమించింది.

‘సయ్యారా’ స్టోరీ ఓ మ్యూజిక్ డైరెక్టర్, ఓ రైటర్ మధ్య సాగుతుంది. క్రిష్ కపూర్ పాత్రలో అహాన్ పాండే నటించాడు. తన కెరీర్లో పెద్ద బ్రేక్ కోసం చూస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి వాణి (అనీత్) అనే ఓ రైటర్ ను కలుస్తాడు. అప్పటికే ఆమె బ్రేకప్ బాధలో ఉంటుంది. వాణి డైరీలోని కవితలను క్రిష్ పాటలుగా మారుస్తాడు. అవి పెద్ద హిట్ అవుతాయి. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. కానీ వాళ్ల ప్రేమకు అడ్డంకి ఎదురవుతుంది. చివరికి వాళ్లు కలుస్తారా లేదా అన్నదే సయ్యారా మూవీ స్టోరీ. ఈ మూవీ మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

మొత్తంమీద, సయ్యారా సినిమా యువతను ఆకట్టుకుని, భారీ వసూళ్లను సాధించింది. ఇది 2024లో విడుదలైన చిత్రాలలో ఒక గుర్తుండిపోయే విజయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.